CBI Searches Satya Pal Malik: జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్ సత్యపాల్‌ మాలిక్‌కి దర్యాప్తు సంస్థ CBI షాక్ ఇచ్చింది. రకరకాల సిటీల్లో ఉన్న 30 ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. Kiru Hydropower ప్రాజెక్ట్‌లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు సత్యపాల్ మాలిక్. ఇవాళ ఉదయం (ఫిబ్రవరి 22)  నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 100 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. రూ.2,200 కోట్ల విలువైన కిరు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ (HEP)లో అవినీతి జరిగిందని CBI తేల్చి చెబుతోంది. సివిల్ వర్క్స్ కేటాయించడంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని స్పష్టం చేస్తోంది. 2022 ఏప్రిల్‌లోనే CBI ఈ కేసులో ఐదుగురిపై కేసు నమోదు చేసింది. వాళ్లలో సత్యపాల్ మాలిక్ కూడా ఉన్నారు. అనుకూలమైన వ్యక్తులకు కాంట్రాక్ట్‌లు అప్పగించారని అంటోంది CBI. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30వ తేదీ వరకూ జమ్ముకశ్మీర్‌కి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా ఉన్నారు సత్యపాల్ మాలిక్. రెండు ఫైల్స్ క్లియర్ చేసేందుకు ఆయన రూ.300 కోట్ల లంచం తీసుకున్నారని CBI తేల్చి చెబుతోంది. అందులో ఒకటి ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఫైల్‌ అని వెల్లడించింది. అయితే...కొద్ది రోజులుగా సత్యపాల్ మాలిక్...అనారోగ్యంగా ఉన్నారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయినా సీబీఐ సోదాలకు తాను పూర్తిస్థాయిలో సహకరిస్తున్నానని వెల్లడించారు. Chenab Valley Power Projects (P) Ltd మాజీ ఛైర్మన్‌పైనా ఇప్పటికే CBI కేసు నమోదు చేసింది. వీళ్లతో పాటు మరి కొంత మంది అధికారులపైనా కేసులు నమోదయ్యాయి. 


"కొద్ది రోజుల క్రితం నేను అస్వస్థతకు గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ నా ఇళ్లలో CBI అధికారులు సోదాలు చేస్తున్నారు. అయినా నా డ్రైవర్, అసిస్టెంట్ వాళ్లకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. సోదాల పేరు చెప్పి అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఈ సోదాల గురించి వింటేనే భయమేస్తోంది. నా మద్దతు రైతులకు ఎప్పటికీ ఉంటుంది. ఇలాంటి చర్యలతో నన్ను భయపెట్టలేరు"


- సత్యపాల్ మాలిక్, జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్