హారర్ సినిమాల్లో ఆత్మలు, ప్రేతాత్మలు కామన్! మనుషులు మరణించిన తర్వాత స్మశాన వాటికకు తీసుకు వెళతారు. తాము పాటించే ఆచారాలను బట్టి దహన సంస్కారాలు చేస్తారు కొందరు. ఖననం చేస్తారు మరికొందరు. స్మశానం నుంచి మరణించిన వ్యక్తి ఆత్మ వస్తుందని నమ్మే జనాలు ఎక్కువ. హారర్ సినిమాలకు ఆత్మలు ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఏకంగా ఆత్మలు తిరిగుతాయని కొందరు నమ్మే స్మశాన వాటికలో టీజర్ లాంచ్ ప్లాన్ చేశారు కోన వెంకట్. 


స్మశాన వాటికలో గీతాంజలి మళ్లీ వచ్చింది
ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌ సంస్థలపై విశాఖ ఎంపీ, రాజకీయ నేత ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న సినిమా 'గీతాంజలి మళ్లీ వచ్చింది'. శివ తుర్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. పదహారణాల అచ్చ తెలుగమ్మాయి అంజ‌లి టైటిల్ పాత్రధారి. ఈ సినిమా కథానాయికగా ఆమె కు 50వది.


'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా టీజర్ (geethanjali malli vachindi teaser)ను ఈ శనివారం బేగంపేట్ స్మశాన వాటికలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఓ తెలుగు సినిమా ఈవెంట్ ఈ విధంగా స్మశానంలో ప్లాన్ చేయడం ఇదే మొదటిసారి.


Also Readప్రభాస్ సినిమా నుంచి తీసేశారు... పవన్‌ కళ్యాణ్‌తో అసలు నటించలేదు... రకుల్ టాలీవుడ్ జర్నీలో ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్!  






త్వరలో దక్షిణాది భాషల్లో విడుదల!
ఇప్పటి వరకు ఇండియాలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలతో కంపేర్ చేస్తే... ఈ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' భారీ బడ్జెట్ సినిమా అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్...  తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కోన వెంకట్ తెలిపారు. టీజర్ విడుదల రోజున సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.


Also Readఆస్కార్స్‌ అవార్డుల్లో 13 నామినేషన్స్... బాఫ్టాలో 7 అవార్డ్స్... హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?



దర్శకుడిగా 'నిన్ను కోరి', 'నిశ్శబ్దం' కొరియోగ్రాఫర్!
కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ఎప్పుడూ కొత్త టాలెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ముందు ఉంటుంది. 'నిన్ను కోరి'తో శివ నిర్వాణను పరిచయం చేశారు. ఇలా చెబుతూ వెళితే ఎంతో మంది టెక్నీషియన్లను పరిచయం చేశారు. ఇప్పుడీ 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' సినిమాతో 'నిన్ను కోరి', 'నిశ్శ‌బ్దం' చిత్రాల‌కు నృత్య దర్శకుడిగా పని చేసిన అట్లాంటా (యు.ఎస్‌)కు చెందిన కొరియోగ్రాఫ‌ర్ శివ తుర్ల‌పాటిని దర్శకుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. 


అంజ‌లి, శ్రీనివాస్ రెడ్డి, స‌త్యం రాజేష్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, అలీ, సునీల్‌, స‌త్య‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, ర‌విశంక‌ర్‌, ప్రియ, ముక్కు అవినాష్‌, విరుపాక్ష ర‌వి, రాహుల్ మాధ‌వ్ త‌దిత‌రులు నటిస్తున్న ఈ చిత్రానికి క‌థ‌: కోన వెంక‌ట్‌, స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌ & భాను కిర‌ణ్‌, మాట‌లు: భాను కిర‌ణ్‌ & నందు, సంగీతం: ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు, ఛాయాగ్రహణం: సుజాత సిద్ధార్థ్, కూర్పు: చోటా కె. ప్ర‌సాద్‌, కళ: నార్ని శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌: నాగు వై, నిర్మాణ సంస్థలు: ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, నిర్మాత‌లు: ఎంవీవీ స‌త్యనారాయ‌ణ, జీవీ, ద‌ర్శ‌క‌త్వం:  శివ తుర్ల‌పాటి.