Brahmamudi Serial Today Episode: కావ్య తన బావతో కలిసి బయట తిరగడానికి వెళ్లిందని ఆఫీసు పనుల గాలికొదిలేసి షికార్లకు వెళ్లిందని ఇంట్లో వాళ్లకు చెప్పి కావ్యకు విడాకులు ఇవ్వొచ్చని రాజ్, శ్వేతతో చెప్పి ఇంటికి వస్తాడు. గార్డెన్లో కూర్చున్న ఇందిరాదేవిని చూసి ఆమె దగ్గరకు చాలా స్పీడుగా వెళ్తాడు. అప్పటికే అంత తెలిసిన ఇందిరాదేవి.. రాజ్ ను చూసి లోపల ప్రేమ ఉన్నా పైకి మాత్రం ఎంత బాగా నటిస్తున్నాడో నా మనమడు అనుకుంటుంది. ఇంతలో ఇందిదాదేవి దగ్గరకు వచ్చిన రాజ్, కోపంగా కావ్యను తిడుతూ.. కావ్య తన బావతో బయటకు వెళ్లిందని చెప్తాడు. నీ మనమరాలు అమాయకురాలు అంటూ వెనకేసుకొస్తావు ఇప్పుడు చూడు ఎంతకు తెగించిందో అంటాడు.
మనసులో ఎంత ప్రేమ ఉన్నా బయటకు మాత్రం బాగా నటిస్తున్నావురా? మనవడా.. అని మనసులో అనుకుంటూ బయటకు మాత్రం ఏమీ ఎరగనట్లు నటిస్తుంది ఇందిరాదేవి. రాజ్ కోపంగా చెప్తూనే ఉంటే ఇక అయిపోయిదా? చాడీలు చెప్పటం అని అంటుంది. నేను చాడీలు చెప్తున్నానా? కావాలిస్తే ఆఫీసుకు ఫోన్ చేసి కనుక్కో బామ్మా అంటూ రాజ్ అసహనం వ్యక్తం చేయడంతో నేను కనుక్కోవాల్సిన అవసరం ఏమీ లేదు. కావ్య తన బావను తీసుకుని మన ఇంటికే వచ్చింది. అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. రాజ్ కు నోట్లోంచి మాటలు రావు. నత్తి వచ్చినవాడిలా మాట్లాడతాడు. అంత కంగారు ఎందుకు రాజ్, కావ్య ఇంట్లోనే ఉంది. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. నువ్వు కూడా పద వెళ్లి మనం భోజనం చేద్దాం అని రాజ్ ను తీసుకుని ఇందిరాదేవి ఇంట్లోకి వెళ్తుంది.
రాజ్, బామ్మతో కలిసి ఇంట్లోకి వెళ్లగానే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటారు. స్వప్న, కావ్య ఇద్దరూ తమ బావకు ప్రేమగా కొసిరి కొసిరి వడ్డిస్తుంటారు. ఇంతలో స్వప్న వాళ్ల బావను ఫారిన్ గురించి అడుగుతుంది. అక్కడ లైఫ్ ఎలా ఉందని అడుగుతుంది. దీంతో వాళ్ల బావ ఫారిన్ లైఫ్ ఎంతో ఎంజాయ్ గా ఉంటుందని.. అక్కడి విశేషాలు చెప్తుంటాడు. అలాగే రుద్రాణి, రాహుల్ ను వెటకారంగా వాళ్ల బావకు పరియచం చేస్తుంది స్వప్న. రుద్రాణి, రాహుల్ కోపంగా చూస్తుంటారు.
అయితే లోపలికి రాజ్, బామ్మ రావడం గమనించిన కావ్య.. వాళ్ల బావకు సైగ చేస్తుంది. దీంతో మరోసారి కావ్య, వాళ్ల బావ తమ నాటకాన్ని మొదలుపెడతారు. అది చూసిన రాజ్ ఇరిటేట్ అవుతుంటాడు. ఇందిరాదేవి మాత్రం లోపల లోపల నవ్వుకుంటుంది. ఇంతలో కావ్య రాజ్, ఇందిరాదేవిని కూడా భోజనం చేయమని పిలుస్తుంది. రాజ్ భోజనం చేయడానికి కూర్చోగానే స్వప్న అదేంటి రాజ్ ఎప్పుడూ లేనిది ఇవాళ లంచ్ చేయడానికి ఇంటికి వచ్చావు అని అడుగుతుంది. దీంతో షాక్ తిన్న రాజ్ ఎం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోతాడు.
ఇంతలో కావ్య మన బావ వచ్చారని కంపెనీ ఇవ్వడానికి వచ్చారనుకుంటా అంటుంది. కంపెనీ అంటే గుర్తుకొచ్చింది అంటూ బావ నువ్వు ఫారిన్ నుంచి వచ్చావు కదా ఎక్కడ ఉంటావు అని అడుగుతుంది. తాను హోటల్లో ఉంటున్నట్లు వాళ్ల బావ చెప్పగానే.. ఇంత ఇల్లు ఉండగా నువ్వు హోటల్ లో ఉండాల్సిన కర్మ నీకెందుకు బావ నువ్వు లగేజీ తీసుకునిరా ఇక్కడే ఉందువు అంటుంది స్వప్న. దీంతో కావ్య, ఇందిరాదేవి కూడా వాళ్ల బావను ఇంట్లోనే ఉండమని చెప్తారు. రాజ్ మాత్రం ఇరిటేటింగ్ గా చూస్తుంటాడు. రాజ్ ను గమనించిన కావ్య వాళ్ల బావ నేను ఇంట్లో ఉండటం మీ ఆయనకు ఇష్టం లేనట్లుంది అంటాడు. దీంతో రాజ్ ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తుండిపోతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: నేను చనిపోయానని అనుకున్నారు, అంతా మా నాన్న వల్లే: ‘మన్మథుడు’ నటి అన్షు