నిరుద్యోగులకు గుడ్ న్యూస్
తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ వేదికగా గురువారం మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) జాబ్ క్యాలెండర్‌పై (Job Calendar) కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. తద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. శాసనసభలో 'యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ' (Young India Skill University) బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి
వైసీపీ రాజ్యసభ ఎంపీలు సిద్ధమా?
ఆంధ్రప్రదేశ్‌లో భారీ మెజార్టీతో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు పాలన వ్యవహారాలతో టీడీపీ అధినే చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడం, హామీల అమలుపైనే తన ప్రధాన ఫోకస్ అంతా ఉంది. ఈ పరిస్థితిలో వైసీపీ అధికారిక మీడియాగా చెప్పుకున్న ఓ పేపర్‌లో వార్త సంచలనంగా మారింది. నిప్పులేనిదే పొగరాదనే సామెతను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇంకా చదవండి
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ ముందు ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకు వచ్చారు. వారిని తర్వాత పోలీసులు అరెస్టు చేసి బస్సులో స్టేషన్‌కు తరలించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం సరి కాదని.. స్పీకర్ చాంబర్ ముందు నుంచి అందరూ వెళ్లిపోవాలని చెప్పినా కదలకపోవడంతో.. మార్షల్స్ వారిని ఎత్తుకుని తీసుకెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇంకా చదవండి
నన్ను పవన్ కల్యాణ్ దగ్గరికి చేర్చండి - లేకుంటే ట్యాంకర్‌కు నిప్పు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యామ్ ఫ్యాన్ అంటూ ఓ అభిమాని హల్ చల్ చేశాడు. తన సమస్య ఆయనకు చెప్పాలని.. పవన్ వద్దకు తనను తీసుకెళ్లాలని ఓ పెట్రోల్ బంక్ వద్ద నానా హంగామా చేశాడు. విశాఖ (Visakha) జిల్లా సింహాచలం (Simhachalam) గోశాలకు వెళ్లే దారిలోని పెట్రోల్ బంక్ వద్ద బుధవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ వద్ద పవన్ అభిమాని అంటూ ఓ వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. తన సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు (Pawan Kalyan) చెప్పాలని.. తనను ఆయన దగ్గరికి చేర్చాలని డిమాండ్ చేశాడు. ఇంకా చదవండి
తెలంగాణలో హృదయ విదారకం
తెలంగాణలో బుధవారం హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ గర్భిణీని లారీ ఢీకొని మృతి చెందగా.. గర్భస్థ శిశువు దాదాపు 10 మీటర్ల దూరంలో ఎగిరిపడిన ఘటన మెదక్ జిల్లాలో (Medak District) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన పనేటీ రేణ (29) ఏడు నెలల గర్భిణీ. ఆమె బుధవారం ఓ వ్యక్తితో కలిసి బైక్‌పై తూప్రాన్ నుంచి మేడ్చల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మనోహరాబాద్ వద్ద జాతీయ రహదారిపై బైక్ యూటర్న్ తీసుకుంటుండగా.. ఓ లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ ఆమె పైనుంచి వెళ్లడంతో గర్భస్థ శిశువు తల్లి పేగు తెంచుకుని బయటకు వచ్చి 10 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై మృతి చెందిన గర్భస్థ శిశువును చూసిన స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంకా చదవండి