నరకాసురుడినైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మొద్దు: జగన్
అమరావతిలోని ఆర్-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. తుళ్లూరు మండలం వెంకటాయపాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడి జగన్.... చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఇంకా చదవండి
వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు - హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు !
వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జులై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు... జులై 1న ఆయనను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో, హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. ఇంకా చదవండి
ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు
దశాబ్ధి ఉత్సవాల నిర్వహణ ప్రధాన ఉద్దేశ్యంగా గురువారం రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ అనేక విషయాలపై చర్చించారు. ముఖ్యంగా జూన్ 2వ తేదీ నుంచి 22 వరకు జరగనున్న ఏ రోజు కారోజు రోజువారీ కార్యక్రమాలను ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు వివరించారు. ఈ మూడు వారాల ఉత్సవాల విశిష్టతను, ప్రాముఖ్యత ప్రాశస్త్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. గ్రామాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారిగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, క్షేత్రస్థాయిలో వాటి నిర్వహణ గురించి ప్రత్యేకంగా చెప్పారు. మంత్రులు, శాసనస భ్యులు, ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఇంకా చదవండి
రేపు కేసీఆర్ వద్దకు కేజ్రీవాల్, ఆ విషయంలో మద్దతివ్వాలని కోరనున్న ఢిల్లీ సీఎం
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ప్రత్యక్ష పోరుకు సిద్ధం అయ్యారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఓ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతును కూడగడుతున్నారు. ఇందుకోసం కేజ్రీవాల్ సీఎం కేసీఆర్‌ను కూడా కలవనున్నారు. అందుకోసం కేజ్రీవాల్ శనివారం (మే 26) హైదరాబాద్‌కు రాబోతున్నారు. పార్లమెంట్‌లో ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరనున్నారు. ఈ విషయంలో కేజ్రీవాల్ ఇప్పటికే బంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేలను కలిసి కూడా చర్చించారు. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్‌తో కూడా రేపు సమావేశం కానున్నారు. ఇంకా చదవండి
ముందస్తు బెయిల్‌పై సుదీర్ఘ వాదనలు - అవినాష్ రెడ్డి ని ఇరికిస్తున్నారన్న లాయర్ !
వైఎస్ వివేకానందరెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ప్రస్తుతం హైకోర్టులో విచారణ సుదీర్ఘంగా జరుగుతోంది. ఇరు వైపుల వాదనలు వాడివేడిగా సాగుతున్నాయి. 2020 జులై 9న సీబీఐ FIR నమోదు చేసి 2021 జులై 21న రంగన్నను సీబీఐ విచారించిందని అవినాష్ రెడ్డి లాయర్ కోర్టుకు తెలిపారు. రంగన్న స్టేట్‌మెంట్ రికార్డు చేసి సంవత్సరం పాటు వదిలేశారని, స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురి వివరాలు చెప్పాడని అవినాష్ లాయర్ అన్నారు. కానీ సీబీఐ నెలరోజుల పాటు దస్తగిరిని విచారణకు పిలవలేదని, దస్తగిరిని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేదని అవినాష్ లాయర్ వాదించారు. మున్నా దగ్గర డబ్బు దొరికినా ఛార్జ్‌షీట్‌లో సాక్షిగా పేర్కొనలేదని, దస్తగిరి స్టేట్‌మెంట్‌లో అవినాష్ పేరు ఎక్కడైనా చెప్పాడా? అని జడ్జి ప్రశ్నించారు. ఇంకా చదవండి