YS Viveka Case : వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని జులై 1న గంగిరెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.   గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తూ గత నెల 27న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 30లోగా దర్యాప్తును పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు... జులై 1న ఆయనను విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో, హైకోర్టు తీర్పును వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. పిటిషన్ ను విచారించిన సుప్రీం ధర్మాసనం జులై 1న గంగిరెడ్డిని విడుదల చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.
  
సుప్రీంకోర్టులో సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణలో   ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ నిబంధనల వ్యవహారంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఎర్ర గంగిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేయడంతో పాటు కస్టడీ తర్వాత విడుదల తేదీని ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు న్యాయశాస్త్రంలో ఎనిమిదో వింతలా ఉన్నాయని సీబీఐ న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.  బెయిల్‌ను గంగిరెడ్డి దుర్వినియోగం చేసిన ఉదంతాలున్నాయని, సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నాయని సునీతారెడ్డి తరపు న్యాయవాది వాదించారు. హత్యలు చేసిన వాళ్లు బయట ఉంటే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళతాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.   


అంతకు ముందు  ఎర్ర గంగిరెడ్డి  బెయిల్  ఉత్తర్వులపై  ఈ నెల  16న  వైఎస్ సునతారెడ్డి  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేశారు.  తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన  బెయిల్ ఉత్తర్వులను  సునీతా రెడ్డి సవాల్  చేశారు.   తెలంగాణ హైకోర్టు  ఇచ్చిన   బెయిల్  ఉత్తర్వులపై  సీజేఐ  చంద్రచూడ్  ఆశ్చర్యం  వ్యక్తం  చేశారు.  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి   2019  మార్చి  14న  తన  నివాసంలో  హత్యకు గురయ్యారు.  ఈ హత్య కేసులో  ఏ 1 నిందితుడిగా  ఎర్ర గంగిరెడ్డి      ఉన్నారు.     వివేకానందరెడ్డి హత్య  కేసును  అప్పట్లో సిట్  విచారించింది.   అయితే  సకాలంలో  చార్జీషీట్ దాఖలు  చేయలేదు.  దీంతో ఎర్ర గంగిరెడ్డికి   డిఫాల్ట్  బెయిల్ మంజూరైంది. 


ఆ తర్వాత  చోటు  చేసుకున్న పరిణామాలతో  వివేకానందరెడ్డి హత్య  కేసును  సీబీఐ విచారిస్తుంది. ఏపీ హైకోర్టు  ఆదేశాలతో   ఈ కేసును సీబీఐ విచారిస్తుంది. వివేకానందరెడ్డి  హత్య కేసులో  ఏ1 నిందితుడు  ఎర్ర గంగిరెడ్డి  బెయిల్ రద్దు  కోరుతూ  సుప్రీంకోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది.  ఈ బెయిల్ పిటిషన్ పై విచారణను  తెలంగాణ హైకోర్టుకు  సుప్రీంకోర్టు  బదిలీ  చేసింది.  ఈ పిటిషన్ పై విచారించిన  తెలంగాణ హైకోర్టు   ఎర్ర గంగిరెడ్డి బెయిల్  ను రద్దు  చేసింది. అందులో జూలై ఒకటిన విడుదల చేయాలని ఉండటంతో సునీత కోర్టుకెళ్లి డీఫాల్ట్ బెయిల్ మను రద్దు చేయించారు.