సోషల్ మీడియా ప్రభావం అటు సమాజం మీద ఇటు జనాల వ్యక్తిగత జీవితం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోందనేది ఎవరూ కాదనలేని విషయమే. కొందరి పర్సనల్ జీవితాలు ప్రభావితమైతే మరికొందరి ఆరోగ్యం. లైకులు, షేర్ లే జీవితంగా అడిక్ట్ అయిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. పాపులారిటి పిచ్చిగా మారిపోయిన రోజుల్లో మనం బతుకుతున్నాం.
మొత్తం జనాభాలో దాదా 84 శాతం మంది సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారట ప్రస్తుతం. రాత్రిపూట సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయిన తర్వాత జనాభాలో ఎక్కువ శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారట. నిద్రపోవడానికి కాస్త ముందు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్ల మీరు గంటల తరబడి మేలుకొనే ఉంటారని పరిశోధకులు అంటున్నారు. నిద్రవేళకు ఒక గంట ముందు ఏదైనా పోస్ట్ చెయ్యడం వల్ల నిద్రకు రెండు మూడు గంటల వరకు లేటవుతుందని ఒక అధ్యయనం చెబుతోంది.
2005 నుంచి 2021 వరకు 51000 కంటే ఎక్కువ ‘రెడిట్’ అనే సోషల్ మీడియా సైట్‌లో వినియోగదారుల పోస్టులను పరిశోధకులు ట్రాక్ చేశారు. వారు పోస్ట్ చేసిన సమయం వారు సైట్ లో ఎంతకాలం పాటు ఉన్నారు అనే దాని పైన ప్రభావం చూపడాన్ని గమనించాట. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు స్క్రీన్ లైట్ వల్ల సర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలగడం నుంచి పెట్టిన పోస్ట్ కు వచ్చే స్పందన కోసం ఎదురు చూడడం వరకు ఏదైనా కారణం కావచ్చని డ్యూక్ యూనివర్సిటి కి చెందిన డాక్టర్ విలియం మేయర్సన్ అంటున్నారు.
బెడ్ టైమ్ కంటే ఒక గంట లేదా అంతకంటే తక్కువ సమయంలో రెడిట్‌లో పోస్ట్ చేసినపుడు, ఒకటి కంటే ఎక్కువ హై ఎంగేజ్డ్ ఫోరమ్ లలో ఆక్టివ్ గా ఉంటే నిద్ర వేళ దాటి మరిన్ని పోస్టులు చెయ్యడాన్ని గమనించారట. మంచం మీద ఫోన్ స్క్రోల్ చెయ్యడం ఈ మధ్యకాలంలో చాలా సాధారణం అయిపోయింది. అయితే స్ర్ర్కీన్ నుంచి వచ్చే బ్లూలైట్ చూస్తుండడం వల్ల సహజమైన స్లీప్ సైకిల్ కి అంతరాయం ఏర్పడుతోంది. బ్లూలైట్ నిద్రకు దోహదం చేసే హార్మోన్లను అడ్డుకోవడం వల్ల నిద్ర తేలిపోతుందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అధ్యయన వివరాలు స్లీప్ మెడిసిన్ అనే జర్నల్ లో ప్రచురించారు. రెడిట్ వినియోగదారుల పోస్టులను ట్రాక్ చెయ్యడం ద్వరా రాత్రిపూట సైట్ ను ఉపయోగించడం వారి నిద్రను ఎలా ప్రభావితం చేసిందో తెలుసుకోవడానికి ఉపయోగించి నిద్ర వేళలను అంచనా వేసింది. ఈ అధ్యయనం కోసం 16 సంవత్సరాల కాలంలో 236 మిలియన్ల పోస్టులను విశ్లేషించారు. ఈ సోషల్ మీడియా వినియోగదారులు నిద్రపోయే సమయం దాటిన తర్వాత ఎన్ని పోస్టులు పోస్ట్ చెశారు అనేదాన్ని విశ్లేషించారు.
నిద్ర వేళ దాటిని తర్వాత కూడా 1-3 గంటల పాటు మెలకువగా ఉంటున్నట్టు నిర్ధారణ అయ్యింది. వారి చివరి ప్రీ బెడ్ టైమ్ పోస్ట్ వారి నిద్ర వేళకు ఒక గంట లోపే ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అలా పోస్ట్ చేసిన వారు ఆ తర్వాత చాలా సమయం పాటు మెలకువగా ఉండేందుకు అస్కారం ఉంది.
Also read: ఐబీఎస్‌తో కడుపులో గడబిడ? ఈ చిట్కాలు పాటిస్తే ఏ సమస్య ఉండదట!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.