ఐబీఎస్ (Irritable bowel syndrome) నుంచి విముక్తి కావాలంటే జీవితకాలం పాటు కొంత నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం రావచ్చు. ఎలాంటి పనుల వల్ల ఇబ్బంది పెరుగుతుందో గమనించి అటువంటి అలవాట్లకు, ఆహారాలకు దూరంగా ఉండడం అవసరం. ఈ అలవాట్లు ఒకొక్కరిలో ఒక్కోవిధంగా ప్రభావం చూపవచ్చు. అందరిలో సాధారణంగా కనిపించే కొన్ని అలవాట్లు వాటి పరిణామాల గురించి నిపుణులు ఏమని చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.
- రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి.
- వీలైనంత ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఇది ఐబీఎస్ ను ట్రిగర్ చేస్తుంది.
- వ్యాయామం చెయ్యడం, పుస్తకం చదవడం లేదా ఒక రోజు పని నుంచి విరామం తీసుకోవడం వంటి చిన్న జాగ్రత్తలతో ఒత్తిడిని మేనేజ్ చెయ్యవచ్చు.
- క్రమం తప్పకుండా భోజనం చెయ్యడం తప్పనిసరి. చాలా కాలం పాటు ఆకలిగా ఉండకుండా జాగ్రత్త పడాలి.
- గట్ ఆరోగ్యానికి తోడ్పడే ప్రోబయాటిక్స్ , ప్రీబయోటిక్స్ సప్లిమెంటరీల రూపంలో లేదా ఆహారంలో తీసుకోవాలి.
ఐబీఎస్‌తో బాధపడుతున్న ఓ డాక్టర్ చెప్పిన వివరాల ప్రకారం.. ఆయనకు ఎక్కువగా కడుపు ఉబ్బరంగా మారి చూసేందుకు గర్బిణి పొట్టలా కనిపిస్తుంది. కడుపులో నొప్పి రావడం రోజుకు కనీసం 15 సార్లు విరేచనానికి వెళ్ళాల్సి రావడం వంటి సమస్యలతో బాధపడతారు. తన సమస్య గురించి చెబుతూ ‘‘సమస్య తిరగబెట్టిన రోజున చాలా శక్తి సన్నగిల్లి నీరసంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఏ పని చేసేట్టు ఉండదు. ఏ విషయానికి కమీట్ కాలేను.’’ ఐబీఎస్ కు పూర్తి స్థాయిలో చికిత్స అందుబాటులో లేనందున దీన్ని అదుపులో ఫెట్టుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించవచ్చు. అయితే అందరికి ఒకేరకమైన చిట్కాలు పనిచెయ్యకపోవచ్చని ఆయన తెలిపారు.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని చిట్కాలు
- సరిపడినంత నిద్ర పోవాలి. దాదాపు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవాలి.
- రోజుకు కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు తప్పకుండా వ్యాయామం చెయ్యాలి.
- ఐబిస్ ను ట్రిగర్ చేసే ఆహారపదార్థాలను తినకూడదు. ముఖ్యంగా కారం, మసాల కలిగిన ఆహారం తీసుకోవద్దు. రిఫైన్డ్ షుగర్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కూడా వీలైనంత తక్కువగా తీసుకోవాలి.
- వదులుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. అకస్మాత్తుగా లక్షణాలు మొదలైతే ఇబ్బంది ఉండదు.
- ఒక ఎమర్జెన్సీ కిట్ కూడా వెంట పెట్టుకోవాలి. దీనిలో ఒక వేడినీళ్ళ బాటిల్, చల్లని నీళ్ళ బాటిల్, పిప్పరమెంట్ టీ కడుపు ఉబ్బరం తగ్గించుకునేందుకు, ఒత్తిడి తగ్గించుకునేందకు హిప్నోథెరపి రికార్డింగ్ అందుబాటులో పెట్టుకోవడం మంచిది.
- ఆహారానికి సంబంధించిన డైరీ ఒకటి మెయింటైన్ చెయ్యడం మంచిది. ముదురు రంగు కూరగాయలు, ఆకుకూరలు తినాలి. పోషకాహార లోపం ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ప్రోబయాటిక్స్, ప్రీ బయోటిక్స్ వాడుతుండాలి. ఇది జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also read: ఆ ఆహారాన్ని గడువు దాటిన తర్వాత తింటే, ఇక అంతే సంగతులు!