Tamilanadu News: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. చెన్నై, కోయంబత్తూర్, కరూర్ జిల్లాల్లో ఏక కాలంలో 40 చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. మంత్రితో పాటు ఆయనతో సంబంధాలు ఉన్న మరికొంత మంది ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన పత్రాలను ఇన్ కం టాక్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సోదాలు ప్రారంభించగా.. ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అయుతే ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.