Morning Top News:


తెలంగాణలో విచిత్ర రాజకీయం


తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గంలో  మూడు ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.  దీంతో నేతలు పలువురు ఆశావహులు ఇప్పటినుంచే తమ ప్రచారాలు ప్రారంభించారు.  ఈసారి గట్టి పోటీ ఇచ్చేందుకు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.. 


శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 17 నుంచి ధాన్యం సేకరణ


 ఈ నెల 17 నుంచి ధాన్యం సేకరణ ప్రారంభిస్తున్నట్టు మంత్రి అచ్చెన్న తెలిపారు. మూడు నెలలు ఛాలెంజ్‌గా తీసుకొని కష్టపడాలని అధికారులకు సూచించారు. ధాన్యం సేకరణ ఒక పద్ధతి, విధానంలో జరగాలన్నారు. ఒడిశా నుంచి ఏపీలోకి ధాన్యం రాకుండా నివారించాలని అధికారులను అచ్చెన్న ఆదేశాలు ఇచ్చారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


అడ్డొస్తే బుల్డోజర్లతో తొక్కిస్తా: రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేట్టిన సీఎం రేవంత్ రెడ్డి ధర్మారెడ్డి పల్లి గూడెంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మూసీ ప్రక్షాళన చేసి తీరతానన్నారు. బుల్డోజర్లకు అడ్డంగా నిలబడాలనుకునేవారు పేర్లు ఇవ్వాలని, వాళ్ల పై నుంచి బుల్డోజర్లను నడిపిస్తానన్నారు. మూసీకి అడ్డువస్తే కుక్కచావు చస్తారన్నారు. బీఆర్ఎస్ వాళ్లు అడ్డొస్తే.. వాళ్ల నడుముకి తాడు కట్టి మూసీలో ప్రజలు ముంచుతారన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

యాదగిరి గుట్టగా యాదాద్రి.. సీఎం కీలక నిర్ణయం

యాదాద్రి ఆలయ అభివృద్ధిపై జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం యాదాద్రిగా పిలుస్తున్న పేరును యాదగిరి గుట్టగా మార్చాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు. టీటీడీ తరహాలో యాదగిరి గుట్టలో టెంపుల్ బోర్డు ఉండాలని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

జగన్ వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నారా..?

ప్రజాస్వామ్య రాజకీయాల్లో రాజకీయ పార్టీలకు మనుగడ ఉండాలంటే ప్రధానంగా చేయాల్సిన పని ఎన్నికల్లో పాల్గొనడం, అసెంబ్లీకి హాజరవడం. ఈ రెండు రాజ్యాంగ పరంగా ఎంతో కీలకం.  ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఈ రెండింటిని లైట్ తీసుకుంటోంది. నేరుగా సాధారణ ఎన్నికల్లో పోటీ పడితే చాలని .. అసెంబ్లీకి వెల్లకపోయినా ఏమీ కాదని అనుకుంటోంది. ఈ పార్టీ ఇటీవల తీసుకున్న రెండు నిర్ణయాలతో రాజకీయవర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. వ్యూహాత్మకంగా ఘోర తప్పిదాలు చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్

కడప జిల్లా పులివెందులకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పాలమూరు జిల్లాలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. కడప పీఎస్‌కు తరలించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, హోం మంత్రి అనిత, షర్మిల, విజయమ్మ, సునీతపై సోషల్‌ మీడియాలో అత్యంత హేయంగా పోస్టులు పెట్టడంతో వర్రాపై కేసులు నమోదు అయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

 తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ‘నా అరెస్టు కోసం ఉవ్విళ్లూరుతున్న రేవంత్‌ రెడ్డి, మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చెయ్యడానికి? , ఆంధ్రా కాంట్రాక్టర్‌ని, తన ఈస్ట్ ఇండియా కంపెనీని కొడంగల్‌ లిఫ్ట్ ఇరిగేషన్‌ నుండి తీసివేయడానికి? దమ్ముందా? CM అయ్యుండి మేఘాకు గులాంగిరీ చేస్తున్నావా?’ అని ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీలు

శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా సాగుతున్న కూటమి ప్రభుత్వం పాలనలో దూకుడు ప్రదర్శిస్తోంది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు 20 మంది డీఎస్పీల పేర్లతో కూడిన బదిలీల ఉత్తర్వులను డీజీపీ ద్వారకా తిరుమలరావు పేరిట విడుదల చేసింది. బదిలీ అయిన ప్రాంతాల్లో తక్షణమే రిపోర్టు చేయాలని సంబంధిత డీఎస్పీలను ఆదేశించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

పట్టాలు తప్పిన షాలిమార్ ఎక్స్‌ప్రెస్

పశ్చిమ బెంగాల్‌లో రైలు ప్రమాదం జరిగింది. నవాల్‌పూర్ రైల్వేస్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి షాలిమార్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది.. సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..

 

సంజు శాంసన్‌ అరుదైన రికార్డు

సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ సెంచరీతో107(50 బంతుల్లో) చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో రెండు వరుస టీ20 మ్యాచ్‌ల్లో శతకాలు బాదేసిన మొదటి భారత ఆటగాడిగా సంజు రికార్డు సృష్టించాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో సెంచరీ 111(47 బంతుల్లో) చేశాడు. అంతేకాకుండా టీ20ల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే (202/8) అత్యధిక స్కోరు కావడం గమనార్హం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..