Secunderabad Shalimar Express : సికింద్రాబాద్‌ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్తున్న షాలిమార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. నవాల్‌పూర్ రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు పట్టాలు తప్పినట్టు సమాచారం. పలువురికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది.  


షాలిమార్ సికింద్రాబాద్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని నల్పూర్ స్టేషన్ పట్టాలు తప్పింది. ఈరోజు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో షాలిమార్ స్టేషన్ వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఎక్స్‌ప్రెస్ లైన్ నంబర్ వన్ నుంచి బయలుదేరాల్సి ఉన్నప్పటికీ, అది ఎలాగో లైన్ నంబర్ టూకి వచ్చింది. దీంతో ఎక్స్‌ప్రెస్‌లోని మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటన కారణంగా హౌరాలోని రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై సౌత్ ఈస్టర్న్ రైల్వే అథారిటీ విచారణ ప్రారంభించింది. తక్కువ వేగంతో  ట్రైన్ నడుస్తుండటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు అంటున్నారు.  


శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. షాలిమార్ స్టేషన్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వచ్చిన పెద్ద శబ్ధంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. మూడు కోచ్‌లు పట్టాలు తప్పడంతోపాటు, రైలు ఇంజిన్‌లో ఎక్కువ భాగం పట్టాలు తప్పింది. 



ఈ రైలు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఉదయం 6:00 గంటలకు షాలిమార్ స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంది. షాలిమార్‌లోకి ప్రవేశించే ముందు నల్పూర్ స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు తప్పింది. రైలులోని పార్శిల్ కోచ్, రెండు ప్యాసింజర్ వ్యాన్‌లు పట్టాలు తప్పాయి. 


రైలు పూర్తిగా వేరే లైన్‌లో వెళ్లిందని ప్రయాణీకులు చెప్పాడు. అందుకే మూడు బోగీలు పక్కకు ఒరిగాయి. రైలు వేగం తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది. రైల్వేశాఖ సహాయ చర్యలు ప్రారంభించింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది ప్రయాణికులు రైలు దిగి పరుగులు పెట్టారు. 


ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం రైలు నంబర్ వన్ ద్వారా వెళ్లాల్సి ఉన్నా, అది లైన్ నంబర్ టూకు మారింది. ఇదే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ఇంజనీర్లు, ఆర్పీఎఫ్, జీఆర్పీ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రమాదానికి కారణమేమిటనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు