IND vs SA: టీ 20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసిన టీమిండియా- దక్షిణాఫ్రికాపై 61 పరుగుల తేడాతో విజయం 

IND vs SA 1st T20: దక్షిణాఫ్రికాతో డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ భారీ విజయం సాధించింది. సంజూశాంసన్ రికార్డు సెంచరీతో మ్యాచ్‌లో హీరో అయ్యాడు. 

Continues below advertisement

IND vs SA 1st T20 Match Report: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. డర్బన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 202 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ చేసి 141 పరుగులకే ఆలౌట్ అయింది. 

Continues below advertisement

భారత్ ఇన్నింగ్స్‌లో సంజూ శాంసన్ రికార్డు సెంచరీకి తోడు రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి ఘోరమైన బౌలింగ్ భారత జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాయి. శాంసన్ 107 పరుగులు చేయగా, బిష్ణోయ్, చక్రవర్తి చెరో మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాను పడగొట్టారు. 

టాస్‌ ఓడిన భారత జట్టును తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించారు సఫారీలు. అభిషేక్ శర్మ మొదట్లోనే అవుట్ అయినా అవతలి ఎండ్‌లో ఉన్న సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాడు. వరుసగా రెండో టీ20 మ్యాచ్‌ల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 18 బంతుల్లో 33 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్దరు భారత స్కోరును 200 పరుగులు దాటించడంలో కీలక పాత్ర పోషించారు. పాట్రిక్ క్రుగేర్ ఓ 11 బంతులు వేయడం చర్చనీయాంశమైంది. సూర్యకుమార్ వికెట్ తీసుకోవడం కాస్త ఊరట నిచ్చింది. 

దక్షిణాఫ్రికా జట్టు విఫలమైందని తేలింది
సొంతగడ్డపై 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికాకు మంచి ప్రారంభం దొరకలేదు. కెప్టెన్ మార్‌క్రమ్‌ కేవలం 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అక్కడితో ఆతిథ్య జట్టు వికెట్ల పతనం ఆగలేదు కేవలం 44 పరుగులకే కీలకమైన ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు కోల్పోయింది. తర్వాత హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వరుణ్ చక్రవర్తి ఆ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఇద్దరినీ ఒకే ఓవర్‌లో అవుట్ చేశాడు. దీంతో ఆఫ్రికన్ జట్టును కోలుకోలేకుండా చేసాడు. బౌలింగ్‌లో పరుగులు భారీగా ఇచ్చిన పాట్రిక్ క్రూగేర్‌కు బ్యాటింగ్‌లో కూడా ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. 

భారత బౌలర్లు విధ్వంసం 
చివరి 5 ఓవర్లలో భారత జట్టు సరిగా బ్యాటింగ్ చేయకపోయినా బౌలర్లు దానిని సరిదిద్దారు. దక్షిణాఫ్రికా ఆరంభం నుంచి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు కష్టపడుతున్నట్లు కనిపించింది. ఆతిథ్య జట్టు 44 పరుగుల స్కోరు వద్ద 3 వికెట్లు కోల్పోయి స్కోరు 93 పరుగులకు చేరుకునే సమయానికి 7 మంది బ్యాట్స్‌మెన్ పెవిలియన్ బాట పట్టారు. చివరి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా 125 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది, కానీ మిడిల్ ఓవర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్‌ అద్భుతమైన బౌలింగ్ కారణంగా మలుపు తిరింగి. టీమిండియా విజయం సాధించింది. వీరిద్దరూ చెరో మూడు వికెట్లు తీయగా, అవేష్ ఖాన్ రెండు, అర్ష్‌దీప్ సింగ్ ఒక వికెట్ తీశారు.

చివరకు దక్షిణాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్‌ను 61 పరుగుల తేడాతో కోల్పోయింది. మ్యాచ్ విన్నింగ్‌ సెంచరీతో అదరగొట్టిన సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Also Read: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు

Continues below advertisement