Top 10 Headlines Today:
లాస్ట్ సెషన్
తెలంగాణలో ఈ విడతకు ఆఖరి అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే మాత్రం ఇవే ఆఖరి సమావేశాలు కానున్నాయి. అందుకే దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అధికార ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
తెలంగాణలో రుణ మాఫీ ప్రక్రియ ప్రారంభం
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నేటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నిర్ణయించారు. తెలంగాణ రైతుల సంక్షేమం వ్యవసాయ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని సీఎం అన్నారు. రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో బుధవారం (ఆగస్టు 2) నాడు సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్నందున మళ్లీ రుణమాఫీని మొదలు పెట్టాలని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
టీడీపీలో జోష్
పులివెందులలో చంద్రబాబు, వినుకొండలో లోకేష్.. ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర.. మరో జిల్లాలో మహిళా శక్తి కార్యక్రమం ఇలా రాష్ట్రంలో ఏ మూల చూసినా టీడీపీ కార్యక్రమాలే జరుగుతున్నాయా అన్నంతగా తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తోంది. ఒక దాని తర్వాత ఒకటి కాకుండా.. ఒకటి కొనసాగుతూండాగనే మరో ప్రచార కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడా గందరగోళం లేకుండా నేతలంతా ఏదో ఓ కార్యక్రమంలో బిజీ అయ్యేలా ప్రచార కార్యక్రమంలో పాల్గొంటూడటంతో.. టీడీపీ మాత్రమే సీరియస్‌గా రాజకీయాలు చేస్తోందా అన్న అభిప్రాయం కల్పించేలా చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఎన్నికలకు తొలి అంకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు తొలి అంకం ప్రారంభం అయింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గెజిట్ నోటిఫికేషన్‌ను బుధవారం విడుదల చేశారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలకు రిటర్నింగ్ ఆఫీసర్లను నియామకం చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఏపీలో తొలి అంకం ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఓం బిర్లా అలక
మణిపూర్ అల్లర్లపై చర్చ జరపాలంటూ, ప్రధాని స్పందించాలని విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. దానికి పోటీగా అధికార పక్షం కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. ఇలా పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఫేక్ యూనివర్శిటీలు ఇవే
దేశంలోని ఫేక్ యూనివర్సిటీల జాబితాను ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రకటించింది. మొత్తం 20 యూనివర్సిటీలను నకిలీవిగా గుర్తించింది. ఫేక్ యూనివర్సిటీలు అధికంగా దేశరాజధానిలో ఉన్నట్లు యూజీసీ తెలిపింది. ఢిల్లీలో అత్యధికంగా ఎనిమిది నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. ఢిల్లీ తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లో నాలుగు, ఏపీలో రెండు, బెంగాల్‌లో రెండు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటితోపాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరిలలో ఒక్కోటి చొప్పున ఫేక్ యూనివర్సిటీలు ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బరిలో దిగ్గజాలు
టీమ్‌ఇండియా క్రికెట్ మ్యాచుల ప్రసార హక్కుల వేలానికి ఉండే క్రేజే వేరు! బీసీసీఐ ఎప్పుడు బిడ్డింగ్ నిర్వహించినా బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటాయి. ఎంత ఖర్చు పెట్టైనా సరే మీడియా హక్కులను దక్కించుకోవాలని తపన పడేవి! కానీ ఇప్పుడా పరిస్థితి లేదని సమాచారం! పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పాజిటివ్ మైండ్ ముఖ్యం
వన్డే వరల్డ్ కప్ కౌంట్ డౌన్ ఇప్పటికే మొదలైంది. స్వదేశంలో జరుగబోయే వన్డే ప్రపంచకప్‌లో ఫేవరేట్‌గా బరిలోకి దిగబోతున్న టీమిండియా.. పదేండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ఒడిసిపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. వరల్డ్ కప్‌కు మరో రెండు నెలలే సమయం ఉండటంతో ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నది. అయితే వరల్డ్ కప్ గెలిచినా ఓడినా పాజిటివ్ మైండ్‌తో ఉండటం ముఖ్యమంటున్నాడు టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. ఐసీసీ ట్రోఫీ నెగ్గడం అంత ఈజీ కాదని కూడా వ్యాఖ్యానించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జైలర్ హవా
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సుమారు రెండేళ్ల విరామం తర్వాత నటించిన మూవీ 'జైలర్' (Jailer Movie). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. కొంత కాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న రజనీ ఈ సినిమాతో ఎలాగైనా కమ్ బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు, తమిళనాడు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక నిర్వహించగా... భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
శర్వానంద్ సినిమాకు వెరైటీ టైటిల్
యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ఏడు అడుగులు వేసి ఇంకా ఏడు నెలలు కాలేదు. జూన్ 3న ఆయన ఓ ఇంటి వాడు అయ్యారు. పెళ్లి తర్వాత కొత్త జంటకు ఎదురయ్యే కామన్ క్వశ్చన్ 'పిల్లలు ఎప్పుడు?' అని! అటువంటిది కొత్త పెళ్ళి కొడుకు సినిమాకు 'BOB' (Baby On Board) టైటిల్ అంటే కాస్త క్రేజీగానే ఉంటుంది కదా! అసలు వివరాల్లోకి వెళితే... పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి