కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) సుమారు రెండేళ్ల విరామం తర్వాత నటించిన మూవీ 'జైలర్' (Jailer Movie). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. కొంత కాలంగా వరుస ప్లాపులతో సతమతమవుతున్న రజనీ ఈ సినిమాతో ఎలాగైనా కమ్ బ్యాక్ ఇస్తాడని ఆయన అభిమానులు, తమిళనాడు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక నిర్వహించగా... భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.


'జైలర్'పై హైప్ ఓ రేంజ్ లో ఉంది. దానిని మరింత పెంచేందుకు తమిళనాడు ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్, రాష్ట్రంలోని అన్ని థియేటర్స్ కి ఒక గమనిక పంపింది. అందులో రజనీకాంత్ 'జైలర్'ను అన్ని సినిమా థియేటర్లలో విడుదల చేయాలని కోరారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతూ సూపర్ స్టార్ రజనీకాంత్ కి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమిళ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ పనీర్ సెల్వం సంతకంతో జారీ చేసిన ఓ నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


Also Read మాటల్లేవ్, కోతలే - కుమ్మేసిన రజనీకాంత్, హిట్టు బొమ్మే!



సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిది మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, సునీల్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కావాలా సాంగ్ గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఆర్ నిర్మల్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.


కాగా గత శుక్రవారం చెన్నైలో జరిగిన 'జైలర్' ఆడియో లాంచ్ ఈవెంట్ లో  కావాలా సాంగ్ తో గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ గా మారిన తమన్నా సినిమా గురించి మాట్లాడుతూ.." జైలర్ సినిమా పాన్ ఇండియా సినిమా కాదని, ఇది నిజానికి ఓ తమిళ సినిమానే అయినా కచ్చితంగా ఈ సినిమా దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ చేరువవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు విడుదలకు ముందే ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం చోటు చేసుకుంది.


కొద్ది రోజుల క్రితం మలయాళ దర్శకుడు సక్కీర్ మాధాతిల్ 'జైలర్' టైటిల్ని 2021 లోనే తన సినిమా కోసం కేరళ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ లో రిజిస్టర్ చేశానని, ఆ టైటిల్ తనదే అని ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయంపై సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆగస్టు 2 కి కేసు విచారణను వాయిదా వేసినట్లు సమాచారం. మరోవైపు చిత్ర యూనిట్ ఆగస్టు 10న సినిమాను విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే  అధికారిక ప్రకటన చేశారు. అయితే ఈ కేసు పై పూర్తి విచారణ జరిగిన తర్వాతే 'జైలర్' థియేటర్స్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.


Also Read : హృతిక్ రోషన్ కల్ట్ క్లాసిక్ 'కోయి మిల్ గయా' రీ రిలీజ్ - ఎప్పుడంటే?



Join Us on Telegram: https://t.me/abpdesamofficial