యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) ఏడు అడుగులు వేసి ఇంకా ఏడు నెలలు కాలేదు. జూన్ 3న ఆయన ఓ ఇంటి వాడు అయ్యారు. పెళ్లి తర్వాత కొత్త జంటకు ఎదురయ్యే కామన్ క్వశ్చన్ 'పిల్లలు ఎప్పుడు?' అని! అటువంటిది కొత్త పెళ్ళి కొడుకు సినిమాకు 'BOB' (Baby On Board) టైటిల్ అంటే కాస్త క్రేజీగానే ఉంటుంది కదా! అసలు వివరాల్లోకి వెళితే...
శర్వా 35వ సినిమాకు టైటిల్ ఖరారు!?
శర్వానంద్ కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంలో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. 'భలే మంచి రోజు' సినిమాతో దర్శకుడిగా పరిచయమై... ఆ తర్వాత 'శమంతకమణి', 'దేవదాస్', 'హీరో' సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా శర్వానంద్ 35వ చిత్రమిది. ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. దీనికి 'BOB' (Baby On Board) టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.
'బేబీ ఆన్ బోర్డు' అనే క్యాప్షన్ ఎక్కువగా కార్స్ మీద కనపడుతుంది. కారులో చిన్న పిల్లలు... అంటే కొన్ని నెలలు క్రితం జన్మించిన చిన్నారులు కారులో ఉన్నారని రోడ్డు మీద మిగతా వాళ్ళకు సమాచారం ఇవ్వడం అన్నమాట. శర్వానంద్ కొత్త పెళ్లి కొడుకు కావడం, ఆయన పెళ్ళైన తర్వాత వస్తున్న సినిమాకు 'బేబీ ఆన్ బోర్డు' టైటిల్ అంటే క్రేజీనే కదా!
శర్వానంద్ జోడీగా కృతి శెట్టి!
'బేబీ ఆన్ బోర్డు' సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి (Krithi Shetty) నాయికగా నటిస్తున్నారు. శర్వా, కృతి జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. సినిమా షూటింగ్ అంతా విదేశాల్లో చేయడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం.
లండన్ నేపథ్యంలో సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా సినిమాను అనౌన్స్ చేశారు. అప్పుడు విడుదల చేసిన స్టిల్స్ చూస్తే... ఇప్పటి వరకు శర్వా చేసిన సినిమాలు అన్నిటిలో కంటే ఇందులో స్టైలిష్ గా కనపడతారని అర్థం అవుతోంది.
Also Read : మాటల్లేవ్, కోతలే - కుమ్మేసిన రజనీకాంత్, హిట్టు బొమ్మే!
శ్వరా 35కు 'ఖుషి' సంగీత దర్శకుడు
ఈ సినిమాకు మలయాళ హిట్ 'హృదయం' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఆయన్ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఖుషి' సినిమాకు ఆయన ఇచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
Also Read : భారీ సినిమాలకు ధీటుగా తీసిన యాక్షన్ థ్రిల్లర్ - 'స్పార్క్' టీజర్‌లో గ్రాండియర్ చూపించారుగా
'BOB Baby On Board' చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : కృతి ప్రసాద్ & ఫణి కె వర్మ, కళా దర్శకుడు : జానీ షేక్, కూర్పు : ప్రవీణ్ పూడి, ఛాయాగ్రహణం : విష్ణు శర్మ, సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, నిర్మాత: టీజీ విశ్వప్రసాద్, రచన - దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial