Top 10 Headlines Today:


 


బోనులో చిక్కిన చిరుత


నడక మార్గంలో తిరుమల వెళ్లే భక్తులకు హ్యాపీ న్యూస్. గత కొన్ని రోజులుగా బయపెడుతున్న చిరుతను అటవీశాఖాధికారులు బంధించారు. రాత్రి ఏడో మైలు వద్ద చిరుత బోనులో చిక్కింది. ఇకపై నడక మార్గంలో ఎలాంటి భయం ఉండబోదని అంతా భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ప్రపంచ ఛాంపియన్ నీరజ్


నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. ఈ ఒలింపిక్ ఛాంపియన్ ను ఇక ముందు ప్రపంచ ఛాంపియన్ అని కూడా పిలవాలి. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


నేడు చంద్రబాబు కీలక భేటీలు


తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. హైదరాబాద్‌ నుంచి ఆదివారం రాత్రి బయలుదేరిన ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. చంద్రబాబు సోమవారం ఢిల్లీలో రెండు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: అమిత్‌షా 


తెలంగాణ సాధన కోసం యువత ప్రాణ త్యాగాలు చేశారని, కానీ రజాకార్లతో కలిసి కేసీఆర్ కూర్చున్నారని అమిత్ షా ఆరోపించారు. కేసీఆర్ రజాకార్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. కేసీఆర్ 9 ఏళ్లుగా రజాకర్లతో కలిసి పాలన కొనసాగిస్తున్నారని, ఆయనను సాగనంపాలంటే ప్రజలు బీజేపీకి మద్దతివ్వాలన్నారు. ఖమ్మంలో రైతు గోస బీజేపీ భరోసా సభకు ముఖ్య అతిథిగా హాజరైన అమిత్ షా మాట్లాడుతూ.. ఒవైసీ మద్దతు కోసం రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేశారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలగా, కమలం వికసిస్తుందని చెప్పారు.  త్వరలో బీజేపీ సీఎం భద్రాద్రిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారని దీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సీఎం సీటు కాదు కదా, సింగిల్ డిజిట్ తెచ్చుకోండీ- హరీష్ కౌంటర్


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సీఎం సీటు కాదు కదా, సింగిల్ డిజిట్ తెచ్చుకునే ప్రయత్నం చేయాలని మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రి హరీష్ రావుకు కౌంటర్ ఇచ్చారు. ఖమ్మం రైతు గోస - బీజేపీ భరోసా సభలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌ రావు ట్విటర్ వేదికగా స్పందించారు.  ‘నూకలు మాకు చెల్లడం కాదు.. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్ గోయల్ వెక్కిరించినప్పుడే బీజేపీకి ఇక్కడ నూకలు చెల్లిపోయాయి. బ్యాట్ సరిగా పట్టుకోవడం చేతకాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది’ అంటూ విమర్శించారు పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ప్రధాని అభ్యర్థి రాహుల్ 


లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలాగైనా బీజేపీ ఓడించాలని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే...ఈ కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఎప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలో రాజస్థాన్‌ సీఎం చేసిన ప్రకటన.. హాట్‌ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల తమ ప్రధాన అభ్యర్థి రాహుల్‌ గాంధీ అని ఆయన చెప్పారు. ముంబైలో జరగబోతున్న ప్రతిపక్షాల కూటమిలో అందరితో చర్చించి.. దీనిపై ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. అయితే... 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రాహుల్‌ గాంధీనే అని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే నిర్ణయించిందన్నారు అశోక్‌ గెహ్లాట్‌. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


 


ప్రతిభావంతులకు ఏపీఎల్ మంచి వేదిక- శ్రీకాంత్


ఆంధ్రలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, అలాంటి వారి ప్రోత్సాహం కోసం ఏపీఎల్ ఉపయోగ పడుతుందని 1983 ప్రపంచ కప్ హీరో కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. ఆంధ్ర క్రికెట్ పని తీరు అద్భుతం అని ఏసీఏ అధ్యక్షులు పి. శరత్ చంద్రా రెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి లను ఇండియా టెస్ట్ కెప్టెన్, బిసిసిఐ మాజీ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ ప్రశంసించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఆసియా కప్ ఆడే జట్లు ఇవే


2023 ఆసియా కప్ ఆగస్టు 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. టోర్నీలో భాగంగా ముల్తాన్‌లో పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇక ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17వ తేదీన జరగనుంది. 2023 ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. ఇప్పటివరకు భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే టోర్నమెంట్ కోసం తమ జట్లను అధికారికంగా ప్రకటించాయి అయితే శ్రీలంక జట్టు కూడా ఫిక్స్ అయింది. కానీ శ్రీలంక క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఇంకా అనుమతి పొందలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌


టాటా ఉత్పత్తి చేస్తున్న కార్లలో నెక్సాన్ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్. దాని సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. ఇప్పుడు కంపెనీ కొత్త నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను వచ్చే నెల 14వ తేదీన అఫీషియల్‌గా లాంచ్ చేయనుంది. అయితే కొత్త టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో చాలా మార్పులు చేశారు. కొత్త నెక్సాన్ అధికారిక లాంచ్‌కు ముందే డీలర్ యార్డ్‌లకు చేరుకోవడం ప్రారంభించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొత్త స్పై షాట్‌లు కూడా కనిపించాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


చంద్రుడు చాలా హాట్ గురూ


ఇస్రో చంద్రయాన్ 3 మిషన్‌పై మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇక్కడి విక్రమ్ ల్యాండర్‌కి అనుసంధానించిన Chandra’s Surface Thermophysical Experiment (ChaSTE) పేలోడ్ అక్కడి ఉష్ణోగ్రతలను రికార్డ్ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు తెలిపింది. ఈ సమాచారం ద్వారా అక్కడి థర్మల్ బిహేవియర్‌ని అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు సులభతరం కానుంది. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా ట్వీట్ చేసింది. ChaSTE పే లోడ్‌ కంట్రోల్డ్ పెనట్రేషన్ మెకానిజంతో పని చేస్తుంది. చంద్రుడి ఉపరితలంపై దాదాపు 10 సెంటీమీటర్ల లోతు వరకూ వెళ్లగలిగే కెపాసిటీ ఉంటుంది. దీనికి దాదాపు 10 టెంపరేచర్ సెన్సార్లు అనుసంధానించారు. ఈ సెన్సార్లే అక్కడి ఉష్ణోగ్రతల వివరాలను అందిస్తాయి. ఉపరితలంపై ఒక్కో చోట ఒక్కో విధమైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఇస్రో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఓ మ్యాప్‌ని కూడా షేర్ చేసింది. లూనార్ సౌత్‌ పోల్ నుంచి ఇలాంటి ప్రొఫైల్ రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి అందిన సమాచారాన్ని వెల్లడించిన ఇస్రో...పూర్తి వివరాలను త్వరలోనే చెబుతామని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి