Chandrayaan-3 Update: 


ఉష్ణోగ్రతల వివరాలు..


ఇస్రో చంద్రయాన్ 3 మిషన్‌పై మరో ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతలకు సంబంధించిన వివరాలు వెల్లడించింది. ఇక్కడి విక్రమ్ ల్యాండర్‌కి అనుసంధానించిన Chandra’s Surface Thermophysical Experiment (ChaSTE) పేలోడ్ అక్కడి ఉష్ణోగ్రతలను రికార్డ్ చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై ఉష్ణోగ్రతల వివరాలు తెలిపింది. ఈ సమాచారం ద్వారా అక్కడి థర్మల్ బిహేవియర్‌ని అర్థం చేసుకోవడం శాస్త్రవేత్తలకు సులభతరం కానుంది. ఇదే విషయాన్ని ఇస్రో అధికారికంగా ట్వీట్ చేసింది. ChaSTE పే లోడ్‌ కంట్రోల్డ్ పెనట్రేషన్ మెకానిజంతో పని చేస్తుంది. చంద్రుడి ఉపరితలంపై దాదాపు 10 సెంటీమీటర్ల లోతు వరకూ వెళ్లగలిగే కెపాసిటీ ఉంటుంది. దీనికి దాదాపు 10 టెంపరేచర్ సెన్సార్లు అనుసంధానించారు. ఈ సెన్సార్లే అక్కడి ఉష్ణోగ్రతల వివరాలను అందిస్తాయి. ఉపరితలంపై ఒక్కో చోట ఒక్కో విధమైన ఉష్ణోగ్రతలు నమోదైనట్టు ఇస్రో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఓ మ్యాప్‌ని కూడా షేర్ చేసింది. లూనార్ సౌత్‌ పోల్ నుంచి ఇలాంటి ప్రొఫైల్ రావడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి అందిన సమాచారాన్ని వెల్లడించిన ఇస్రో...పూర్తి వివరాలను త్వరలోనే చెబుతామని తెలిపింది.