అధినేత ఆగ్రహం
తెలంగాణ భవన్‌లో జరిగిన భారత రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో కేసీఆర్ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను గట్టిగానే హెచ్చరించారు. దళిత బంధు పథకంలో కమిషన్లు తీసుకుంటున్న వారి లిస్ట్ తన దగ్గర ఉందని తోకలు కత్తిరించేస్తానని హెచ్చరించారు. ఆ ఒక్కటే కాదు.. అనేక అంశాల్లో కేసీఆర్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో అంతర్గత విబేధాలు, క్యాడర్ కు అందుబాటులో ఉండకపోవడం సహా.. పలు అంశాలపై మండిపడ్డారు. ఇంకా చదవండి
వైఎస్ రాజకీయ కుటుంబ కథా చిత్రం
వైఎస్ కుటుంబంలో చీలిక రాజకీయ మార్పులకు కారణం కానుందా ? కడపలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీ వర్సెస్ వైఎస్ ఫ్యామిలీ అన్నట్లుగా ఉంటుందా ? విశ్లేషణాత్మక స్టోరీని మీకోసం
తెలుగు రాష్ట్రాల్లో వెదర్ ఎలా ఉంది?
పశ్చిమ విదర్బలోని ఆవర్తనం నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి మీ ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. ఇంకా చదవండి
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో పెట్రోలు ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
భోళా శంకర్ డబ్బింగ్
మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన 'భోళా శంకర్'కు సంబంధించి మేకర్స్ అప్ డేట్ రివీల్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా డబ్బింగ్ పనులను ప్రారంభించినట్టు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.. ఇంకా చదవండి
చెన్నైకి రాజస్థాన్ షాక్
ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్తాన్ రాయల్స్ 32 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ (RR) 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. పూర్తి స్టోరీ ఇక్కడ చదవండి
దిగిరావా బంగారం
కొండెక్కి కూర్చున్న బంగారం రేటు అక్కడి నుంచి దిగి రావడానికి ఇష్టపడడం లేదు. ఒకవేళ దిగొచ్చినా, నామమాత్రంగా తగ్గుతోంది. ఇవాళ, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ₹ 50, స్వచ్ఛమైన పసిడి ₹ 50 చొప్పున దిగి వచ్చాయి. కిలో వెండి ధర ₹ 100 తగ్గింది. మీ మీ ప్రాంతాల్లో ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల తేదీలు ఖరారు
దేశవ్యాప్తంగా కేంద్ర విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నిర్వహించనున్న రాతపరీక్షల తేదీలను స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) ఖరారు చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
‘విరూపాక్ష’ ఆలయ రహస్యాన్ని బ్రిటీషర్లు కూడా తెలుసుకోలేకపోయారు
‘విరూపాక్ష’ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లతో దూసుకెళ్తున్న సినిమా. అయితే, ‘విరూపాక్ష’ పేరుతో ఒక ఆలయం ఉందనే సంగతి మీకు తెలుసా? పూర్తి స్టోరీకి ఇక్కడ క్లిక్ చేయండి
సేవ్ ద టైగర్స్ వెబ్‌సిరీస్ అందుకే తీశారేమో
మహిళల కంటే పురుషులు మరణానికి దగ్గరగా ఉంటున్నారట. దీర్ఘాయువు విషయంలో స్త్రీపురుషుల మధ్య అంతరం రోజురోజుకు పెరుగుతోందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఆసక్తికరమైన స్టోరీకి ఇక్కడ క్లిక్ చేయండి