Top 10 Headlines Today: 


 


టీఎస్ఆర్టీసీపై కీలక నిర్ణయం


తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఎస్ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అంగీకరించారు. విలీనానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసేలా ఓ కమిటీ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. గతంలో 2019లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సందర్భంగా.. వారి ప్రధాన డిమాండ్ గా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఉండేది. అయితే, సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వంలో విలీనం చేయబోమని కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగులను అరచేతిలో పెట్టుకొని చూసుకుంటామని అప్పట్లో చెప్పారు. కానీ, తాజాగా టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేలా నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విలీనం పూర్తి అయితే ఇకపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా 43,373 మంది టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను కూడా పరిగణిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


జగనన్న సురక్ష 30 రోజుల్లో జరిగిందేంటంటే...


31 రోజుల్లో 15,004 సచివాలయాల పరిధిలో సర్వే పూర్తి, 2.68 లక్షల క్లస్టర్లలో 1.42 కోట్ల ఇళ్లను సందర్శించిన వాలంటీర్లు స్దానిక ప్రజల నుండి 93.36 లక్షల వినతులను స్వీకరించి వాటికి, పరిష్కారం చూపించారు. అయితే  జూలై 18వ తేదీ ఒక్కరోజే  7.54 లక్షల వినతులను తీసుకొని వాటికి పరిష్కారం కూడా చూపించటం మరొక రికార్డుగా ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


చెప్పుతో కొట్టుకున్న కౌన్సిలర్‌


వార్డు కౌన్సిల్‌గా ఎన్నికై దాదాపు మూడేళ్లు అవుతున్నా తన ప్రజల కోసం ఏ చేయలేకపోతున్నానని ఆవేదనతో ఓ కౌన్సిలర్‌ చెప్పుతో కొట్టుకోవడం వైరల్‌గా మారింది. నర్సీపట్నం మున్సిపల్‌ సమావేశంలో జరిగిన ఘటన నేషల్ మీడియాలో కూడా మారుమాగిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌


మెట్రో ట్రైన్, కేబుల్ బ్రిడ్జ్, ఫ్లైఓవర్లు, అండర్‌ పాస్‌లతో ఉన్న హైదరాబాద్‌లో మరో అద్భుతమైన కట్టడం ఆకట్టుకోనుంది. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ జంక్షన్ వరకు, అటు జింఖానా గ్రౌండ్ నుంచి తూంకుంట వరకు ఈ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు రానున్నాయి. చెరో 18కిలోమీటర్లు మేర ఈ కట్టడాలు ఆకట్టుకోనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పెరుగుతున్న కండ్లకలక కేసులు  


ఎడతెరిపిలేని వర్షాల వల్ల సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. కండ్లకలక కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. తేమతో కూడిన వాతావరణం వల్ కంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కంటి ఇన్ఫెక్షన్ లు విపరీతంగా వ్యాపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా కండ్లకలక కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కంటి శుభ్రత పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో కండ్లకలక కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కండ్ల కలక ప్రాణాంతకం కానప్పటికీ దీని వల్ల కొన్ని రోజుల పాటు బాధపడాల్సి వస్తుంది. ఎలాంటి చికిత్స అవసరం లేకుండానే వారంలో లక్షణాలు తగ్గిపోతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


హర్యానాలో చెలరేగిన ఘర్షణలు


మణిపూర్‌లో రెండు వర్గాల మధ్య చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చడం తెలిసిందే. ఈ విషయంపై గత కొన్నిరోజులుగా పార్లమెంట్ ఉభయ సభలలో అధికార, విపక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి నెలకొంది. తాజాగా హర్యానాలో మరో గొడవ చెలరేగడం కలకలం రేపుతోంది. హర్యానాలోని నుహ్‌ ప్రాంతంలో ఒక మతానికి సంబంధించిన ఊరేగింపుపై  రాళ్లు రువ్వడంతో పాటు కార్లకు నిప్పంటించడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణ మరింత తీవ్రం కాకుండా, శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఘర్షణ పరిస్థితుల కారణంగా నుహ్ ఏరియాలో మొబైల్ ఇంటర్నెట్ తో పాటు మెస్సేజ్ సేవల్ని ఆగస్టు 2 వరకు నిలిపివేశారు. 144 సెక్షన్ విధించి, జనాలు గుంపులు గుంపులు లేకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


షాపూర్‌​లో ఘోర ప్రమాదం


మహారాష్ట్రలో మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. థానేలోని షాపూర్‌​లో.. భారీ క్రేన్​ (గర్డర్​) ఒక్కసారిగా కుప్పకూలి 16 మంది మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వంతెనలు తయారు చేసేందుకు వాడే ఉపయోగించే గడ్డర్ క్రేన్ కులిపోవడంతో ప్రమాదం జరిగింది.  సంవృద్ధి ఎక్స్‌ప్రెస్‌ రహదారి నిర్మిణంలో భాగంగా మూడో దశ పనులు జరుగుతుండగా ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థంలో మరో ఐదుగురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


టీమ్ ఇండియాకు నంబర్-4 సమస్య 


2023 ప్రపంచ కప్ భారత గడ్డపై జరగనుంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది. కాగా ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19వ తేదీన జరగనుంది. కానీ టీమ్ ఇండియాకు నంబర్-4 సమస్య అలాగే ఉంది. గత సంవత్సరం నుంచి ఎనిమిది మంది ఆటగాళ్లను ఈ స్థానంలో ప్రయత్నించారు. కానీ ఎవరూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఫ్యాన్ వార్స్


సినీ పరిశ్రమలో ఫ్యాన్ వార్స్ అనేవి చాలా సహజంగా మారిపోయాయి. పైగా ఒక్కొక్కసారి ఇవి శృతిమించిపోతున్నాయి కూడా. హీరోలు ఎవరి పని వారు చేసుకుంటూ, కలిసి మెలిసి ఉంటున్నా కూడా ఫ్యాన్స్ మాత్రం ఇతర హీరోలు మాట్లాడే మాటల్లో, చేసే పనుల్లో కావాలని తప్పులు వెతుకుతూ వారిని ట్రోల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో జరిగే ట్రోల్స్ విపరీతంగా ఉంటాయి. తాజాగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు.. విజయ్ ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇది కోలీవుడ్‌లో జరిగే ఫ్యాన్ వార్‌కు మరోసారి జీవం పోసినట్టుగా అయ్యింది. విజయ్ సినిమా గురించి రజినీ ఓపెన్‌ కామెంట్స్ చేయడమే దీనికి కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తేలికపాటి వర్షాలు


‘‘నిన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలలోని వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్ప పీడన ప్రాంతం ఈ రోజు ఉదయం తీవ్ర అల్పపీడన ప్రాంతంగా బలపడి ప్రస్తుతం ఉత్తర బంగాళాఖాతం మధ్య భాగాలపై కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 9.5 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఉంది. ఇది రాగల 12 గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (జూలై 31) ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి