Top 10 Headlines Today:
పోటాపోటీ సమావేశాలు
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు పది నెలల సమయమే ఉంది. అందుకే ప్రధాన పార్టీలన్నీ వ్యూహాలకు పదనుపెడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తిన విపక్షాలు పాట్నా సమావేశం తర్వాత ఈసారి బెంగళూరులో ఒక్కటయ్యాయి. సోమవారం (జూలై 2024) విందుతోపాటు ఎన్నికలపై విపక్ష నేతలు మేధోమథనం చేశారు. ఇప్పుడు నేటి (జూలై 17) సమావేశం కీలకం కాబోతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మూడు కలిసే పోటీ చేస్తాయంటున్న పవన్
ఎన్డీఏ సమావేశంలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లి జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగొచ్చని అభిప్రాయపడ్డారు పవన్. రాష్ట్ర ప్రభుత్వంపై ఇది ఆధారపడి ఉందన్నారు. ప్రభుత్వ పని తీరుపై క్షేత్రస్థాయిలో చాలా అసంతృప్తి ఉందన్న పవన్... మీడియాలో చెప్పిందానికి భిన్నంగా ఉందన్నారు. అవి వైసీపీని షేక్ చేస్తున్నాయన్నారు. పెచ్చుమీరిపోయిన అవినీతి మరో కారణంగా చెప్పారు. డేటా బ్రీచ్ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మాజీ సీఎం కన్నుమూత
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మంగళవారం (జూలై 18) కన్నుమూశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఆయన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. 79 ఏళ్ల చాందీ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులు, కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సుధాకరన్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జగనన్న తోడు నిధులు
వరుసగా నాలుగో ఏడాది, మొదటి విడతగా జగనన్న తోడు కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తున్నారు. చిరు వ్యాపారుల ఉపాధికి ఈ పథకం ఊతమని ప్రభుత్వం భావిస్తోంది. నిరు పేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ. 10 వేలు చెల్లిస్తోంది ప్రభుత్వం. సకాలంలో చెల్లించినవారికి 10,000కు అదనంగా ఏటా రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకూ వడ్డీలేని రుణాన్ని సర్కారు అందిస్తోంది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ. 10 వేలు అందిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
షర్మిల సవాల్
తెలంగాణలో రైతు రుణమాఫీపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీపై దొర గారిది పూటకో మాట, రోజుకో వేషం అని సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. నమ్మి ఓటేస్తే రుణమాఫీ పథకానికే పంగనామాలు పెట్టి, రైతులకు ఎగనామం పెట్టిన మోసగాడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. అన్నం పెట్టే రైతన్నకు ‘డీ ఫాల్టర్’ ముద్ర వేసిన పాపం కేసీఆర్ దే అన్నారు. లక్ష మాఫీకి 4 ఏళ్లుగా లక్ష మాటలు చెప్పిండే తప్ప లక్ష్యం మాత్రం నెరవేర్చలే అని షర్మిల అన్నారు. మాట మీద నిలబడే దమ్ము కేసీఆర్ కు ఉంటే, తక్షణం 31లక్షల మంది రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జోరు వానలు
నిన్నటి ఉత్తర జార్ఖండ్, దాని పరిసర ఉత్తర ఛత్తీస్‌గఢ్ - ఉత్తర అంతర్గత ఒడిషా వద్ద ఉన్న అల్పపీడనం ఈరోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అయితే దీని అనుబంధ ఆవర్తనం ఈ రోజు దక్షిణ జార్ఖండ్, దాని పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి సుమరు 7.6 కి.మీ ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపు వాలి ఉంది. సుమారు 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద సముద్ర మట్టానికి సుమరు 4.5 కి.మి, 7.6 కి.మీ మధ్యలో గాలి వీచ్ఛిన్నతి కొనసాగుతోంది. రాగల 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో మరొక ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
మరో వివాదం
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి కేటీఆర్ పైన ఛాలెంజ్ విసిరే క్రమంలో ఆయన ఫ్లోలో చేసిన వ్యాఖ్యలు రేవంత్ కు ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. దొమ్మర సామాజికవర్గం పట్ల రేవంత్ రెడ్డి కించపరిచే వ్యాఖ్యలు చేశారని, ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తూ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలను ఊరూరా ఊరేగించారు. చెప్పుదెబ్బలతో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ రాష్ట్ర దొమ్మరుల సంఘం, తెలంగాణ సంచార జాతుల సంఘాల నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఒక్క మార్పు
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా సాగుతున్న యాషెస్ పోరులో ఇంగ్లీష్ జట్టు నాలుగో టెస్టుకు ముందు తుది జట్టులో కీలక మార్పు చేసింది. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను తుది జట్టులోకి తీసుకుంది. మాంచెస్టర్ వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లాండ్‌కూ చాలా కీలకం. ఇప్పటికే సిరీస్‌లో 2-1 తేడాతో వెనుకబడ్డ బెన్ స్టోక్స్ సేన.. మాంచెస్టర్‌లో ఓడినా, టెస్టును డ్రా చేసుకున్నా యాషెస్‌ను సొంతం చేసుకోవడం కష్టమే అవుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
గుండూబాస్‌లు
సినీ అభిమానులను అలరించడానికి హీరోలు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలను అందించడానికి ప్రయత్నం చేస్తుంటారు. వారిలో కొందరు సినిమా కోసం ఎలాంటి సాహసాలు చేయడానికైనా రెడీగా ఉంటారు. కథ డిమాండ్ చేస్తే గుండుతో కనిపించడానికి కూడా వెనకాడరు. ఇప్పుడు లేటెస్టుగా 'జవాన్' చిత్రంలో షారుఖ్ ఖాన్ గుండుతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ గుండు బాసులుగా దర్శనమిచ్చిన హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం! పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రెండో ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన ఎంజీ మోటార్స్
ఎంజీ మోటార్స్ ఇటీవల కామెట్ ఈవీ రూపంలో దేశంలో తన రెండో ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఇంతకు ముందు ఎంజీలో జెడ్ఎస్ ఈవీ మాత్రమే ఎలక్ట్రిక్ కారు. MG కామెట్ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.98 లక్షల నుంచి రూ.9.98 లక్షల మధ్య ఉంది. ఈ కారు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి