ఎయిర్ ఫ్రైయార్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి వంట గదిలో ఒక భాగంగా మారిపోతోంది. అందుకు కారణం ఆరోగ్యకరమైన వంటలు వందేనదుకు ఉపయోగపడుతుంది. నూనె తక్కువగా వేసుకుని రుచికరమైన ఆహారాన్ని దీని ద్వారా పొందవచ్చు. ఒకరకంగా ఓవెన్ లాగా పని చేస్తుంది. కేవలం కొద్ది నూనె, ఆవిరితో ఉడికించుకుని తినే పదార్థాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. మంచిది కదా అని ఎయిర్ ఫ్రైయర్ లో కొన్ని ఆహారాలు వండకూడదు. అవి ఉపకరణాన్ని పాడు చేయవచ్చు. వీటిని పొరపాటున కూడా ఎయిర్ ఫ్రైయర్ లో ఉడికించకూడదు.


చీజ్ ఉత్పత్తులు


చీజ్ బర్గర్లు, శాండ్ విచ్ చాలా రుహయిగా ఉంటాయి. కానీ దాన్ని ఎప్పుడూ ఎయిర్ ఫ్రైయర్ లో వేయించడం లేదా వేడి చేయడం చేయకూడదు. ఫ్రెష్ చీజ్ లేదా దానితో చేసిన ఏదైనా వస్తువు అందులో వేయించడానికి ఉంచితే అది ఎయిర్ ఫ్రైయర్ కి అంటుకుని కాలిపోవచ్చు.


అన్నం


రైస్ మైక్రోవేవ్ లో వేడి చేసి ఉడికించాలి కానీ ఎయిర్ ఫ్రైయర్ లో కాదు. బియ్యం నీటిలో ఉడుకుతాయి. కానీ ఎయిర్ ఫ్రైయర్ లో నీటిని జోడించలేము. ఇది కేవలం ఆవిరితో ఉడికిస్తుంది. ఎయిర్ ఫ్రైయర్ లో ఆహారాన్ని వేడి చేయడానికి లేదా ఉడకబెట్టడం కుదరదు. అందుకే అందులో అన్నం వండకూడదు.


బన్స్


బ్రెడ్ రోస్ట్ చేయడానికి టోస్టర్ కంటే మెరుగైనని ఏదీ లేదు. అది అందుబాటులో లేకపోతే గ్రిడ్ ని ఉపయోగిస్తారు. కానీ అవేవి లేవు కదా అని ఎయిర్ ఫ్రైయర్ లో బన్స్, బ్రెడ్ ఎప్పుడూ టోస్ట్ చేయవద్దు. అది కాలిపోతుంది. రెండోది అధిక ఉష్ణోగ్రత వల్ల క్యాన్సర్ లక్షణాలు వృద్ధి చెందుతాయి.


పాస్తా


ఎయిర్ ఫ్రైయర్ స్టీమింగ్ ప్రయోజనాల కోసం రూపొందించలేదు. అందుకే పాస్తాను ఇందులో ఉడికించలేరు. అయితే ఉడకబెట్టిన పాస్తానీ మరింత ఉడికించేందుకు ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించుకోవచ్చు. అలాగే పాస్తా చిప్ తయారు చేయడానికి ఎయిర్ ఫ్రైయర్ చక్కని ఎంపిక. ఇది బాగా ప్రజాదరణ పొందిన పదార్థం.


ఇవి కూడా వద్దు


ఎయిర్ ఫ్రైయర్ లో నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు కాకుండా బర్గర్, పిజ్జాలు వంటివి వండటం కూడా మంచిది కాదు.


వేపుళ్ళు తినేందుకు ఎక్కువగా ఇష్టం చూపించే వారికి ఈ గ్యాడ్జెట్ చక్కగా ఉపయోగపడుతుంది. అధికంగా నూనెతో వండిన వంటలు తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అదే దీనిలో అయితే అతి తక్కువ నూనెతో వండుకోవచ్చు. అందుకే ఆరోగ్యకరమని అంటారు. ఫ్రెంచ్ ఫ్రైస్, అరటి కాయ వేపుడు, బంగాళాదుంప వేపుడు, చికెన్ వింగ్స్, చికెన్ లెగ్ పీస్ వంటివి ఇందులో చక్కగా ఫ్రై అవుతాయి. ఒవెన్లో గంట పాటు ఉడికే ఆహారం ఇందులో కెవమ్ 20 నిమిషాల్లోనె ఉడికిపోతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 


Also Read: మీ చిన్నారులకు డెంగ్యూ సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే


Join Us on Telegram:https://t.me/abpdesamofficial