Horoscope Today July 18, 2023
మేషరాశి
ఈ రాశివారికి ఈ రోజు శుభప్రదంగా ఉంది. ఆర్థికపరిస్థితి బావుంటుంది. వ్యాపారాభివృద్ది కోసం చేసే ప్రయాణం విజయవంతం అవుతుంది. పెద్దల ఆశీశ్సులు తీసుకుని బయటకు వెళితే మీ పని విజయవంతం అవుతుంది. మీ కృషి పట్టుదలకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది .
వృషభ రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. మంచి సమాచారం అందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. జీవితంలో ముందుకు సాగేందుకు కొత్త ప్రణాళికలు వేసుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. రాజకీయ నాయకులు ఈరోజు సామాజిక కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. గృహ బాధ్యతలు పెరుగుతాయి.
మిథున రాశి
ఈ రాశి విద్యార్థులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీరు ఈ రోజు అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు వారి ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. మీ మనసులో మంచి ఆలోచనలు పుడతాయి. ఆగిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది.
Also Read: జూలై 18 నుంచి అధిక శ్రావణం ప్రారంభం, వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!
కర్కాటక రాశి
ఈ రాశివారికి ఆలోచనల్లో కొన్ని మార్పులుంటాయి. మీ స్నేహితులతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. విద్యార్థులకు శుభదినం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. తల్లిదండ్రుల బాధ్యతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు. కాంట్రాక్టర్లకు ఈరోజు మంచి రోజు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసొస్తాయి.
సింహ రాశి
ఈ రాశివారికి ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు పార్టీల్లో ఉన్నత స్థానం వరించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఈ రోజు శుభదినం. ఆరోగ్యం బావుంటుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అందరితో కలసిమెలిసి ఉండేందుకు ప్రయత్నించండి. వ్యాపారంలో లాభాలొస్తాయి.
కన్యా రాశి
ఈ రాశివారి వైవాహిక జీవితం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగ్గా ఉంటుంది. మీరు తలపెట్టే పనులకు తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం ఉంటుంది. కొత్త ఆలోచనలు చేస్తారు..భవిష్యత్ కోసం నూతన ప్రణాళికలు రచిస్తారు. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఓ శుభవార్త వినే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. రోజంతా ఆనందంగా ఉంటారు .
తులా రాశి
ఈ రాశివారు పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి రావొచ్చు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు ఈరోజు మంచి రోజు కానుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారులు ముఖ్యమైన వారిని కలుస్తారు. ఆర్థిక పరిస్థితి మునుపటి కన్నా మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించకూడేదు. చాలా రోజుల తర్వాత స్నేహితుడిని కలిసే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభపడతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. వివాహితులు జాగ్రత్తగా ఉండాలి..అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. కర్మాగారాల్లో పనిచేసే వారు అప్రమత్తంగా వ్యవహరించండి..ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
ధనస్సు రాశి
ఈ రోజు ఈ రాశికి చెందిన వ్యాపారులు లాభపడతారు. విద్యార్థులకు మంచి రోజు అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా వెంటాడుతున్న సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి.
Also Read: గడిచిన వారం కన్నా ఈ వారం ఈ రాశులవారి ఆర్థిక స్థితి బావుంటుంది!
మకర రాశి
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వివాహితులు ఈరోజు ఆధ్యాత్మిక ప్రదేశాన్ని సందర్శించేందుకు వెళతారు. వ్యవసాయ పనులు ప్రారంభానికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. సానుకూల ఆలోచన పెరుగుతుంది.
కుంభ రాశి
ఈ రాశివారు ఈ రోజు బంధువులను కలుస్తారు. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుంది. ఇంటర్యూలకు హాజరయ్యే నిరుద్యోగులు సక్సెస్ అవుతారు. వ్యాపారంలో లాభాలుంటాయి. కుటుంబానికి సమయం కేటాయించాలి. అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు.
మీన రాశి
ఈ రాశివారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రాశి విద్యార్థులకు ఈ రోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో కొత్తదనం నింపే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించవద్దు.