ఆర్థిక మాంద్యం భయాలతో గతేడాది చివరి నుంచి కార్పొరేట్ సంస్థలతోపాటు స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు విధిస్తున్నాయి. దీంతో ఉద్యోగం కోల్పోయిన వారు తక్కువ ప్యాకేజీకైనా మరోచోట చేరేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన హెచ్‌ఆర్ స్టార్టప్ కంపెనీ సీఈవో జాబ్ మార్కెట్ గురించి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.


'"మా వెబ్‌సైట్‌లో ఉద్యోగప్రకటన చేసిన 48 గంటల్లో మూడు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. జాబ్ మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో?"" అని ట్వీట్ చేశారు. స్ప్రింగ్ వర్క్స్ అనే స్టార్టప్ కంపెనీ రిమోట్ వర్క్ ఆప్షన్‌తో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.



ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తన వెబ్‌సైట్‌లో మాత్రమే పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడా దీనికి సంబంధించి ప్రకటన చేయకున్నా.. పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని కంపెనీ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున్న లేఆఫ్‌లు విధించడం, రిమోట్ వర్క్ అవకాశం ఉండటంతో ఇంతటీ స్పందన వచ్చినట్లు కంపెనీ అభిప్రాయపడింది. ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు ఇది జాబ్ మార్కెట్ పరిస్థితికి అద్దం పడుతోందని కామెంట్లు చేస్తున్నారు.


ALSO READ:


తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 156 మెడికల్ ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆయుష్‌ విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి రాష్ట్ర వైద్యారోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) జులై 13న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 156 మంది ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో54 ఆయుర్వేద, 33 హోమియో, 69 యునానీ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఆగస్టు 7 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 22లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, గతంలో ప్రభుత్వ సర్వీసులో అందించిన సేవలను నియామకానికి ప్రాతిపదికగా తీసుకోనున్నారు. గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు ప్రాధాన్యమిస్తారు. గరిష్ఠ వయసు ఈ ఏడాది జులై 1 నాటికి 44 సంవత్సరాలు ఉండాలి. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో కొలువుల జాతర కొనసాగుతోందని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు ట్విటర్‌లో పేర్కొన్నారు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 400 ఆఫీసర్ పోస్టులు, అర్హతలివే!
పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేపుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 25 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. 
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..


Join Us on Telegram: https://t.me/abpdesamofficial