Tirupati Arjitha Seva Ticket: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను మంగళవారం (ఈ నెల 18 ) ఉదయం 10 గంటలకు టిటిడి అధికారిక వెబ్ సైట్ https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో లో విడుదల చేస్తున్నట్లు తెలిపింది. సమ్మర్ తర్వాత కూడా తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఆర్జిత సేవా కోటాను సైతం కుదించింది. వేసవి సెలవులు ముగిసినా తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆన్ లైన్లో భక్తులు బుకింగ్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.


కలియుగ వైకుంఠనాధుడు కొలువైయున్న తిరుమలకు దేశ నలుమూలలతో పాటు విదేశాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. ఇలా వచ్చిన భక్తులకు టిటిడి విఐపి బ్రేక్, ఆర్జిత సేవ, ప్రత్యేక ప్రవేశ దర్శనం, అంగ ప్రదక్షణ, వయోవృద్దులు, దాతలు, సర్వదర్శనం టైం స్లాట్, దివ్యదర్శనం వంటి వివిధ పద్దతుల ద్వారా టిటిడి స్వామి వారి దర్శనం కల్పిస్తూ ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శన భాగ్యం ఎన్నో జన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి నెల ముందస్తుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను టిటిడి అధికారిక వెబ్‌సైట్ లో విడుదల చేస్తుంటుంది.. ముందస్తుగా టోకెన్లు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా సులభంగా స్వామి వారి దర్శనం చేసుకునే వెలుబాటు కల్పిస్తూ ఉంటుంది టిటిడి. ప్రతి నెల మాదిరిగానే సుదూర ప్రాంతాల భక్తులు, గ్రామీణ ప్రాంతాల భక్తుక సౌఖర్యార్ధం ఈ నెల 18వ తేదీన ఆర్జిత సేవా టోకెన్లను టిటిడి విడుదల చేయనుంది.


వేసవి సెలవులు ముగిసినా భక్తుల రద్దీ తిరుమలలో‌ కొనసాగుతూ ఉండడంతో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నాలుగు వేల ప్రత్యేక‌దర్శన టోకెన్లను టిటిడి అధనంగా విడుదల చేయనుంది. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా టీటీడీ షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది.. ఇందులో భాగంగా అక్టోబరు నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడిప్ కోసం జూలై 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు సొమ్ము చెల్లించి వాటిని ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవాటికెట్లను జూలై 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.. అక్టోబరు నెల ఆంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.. భక్తులు ఈ విషయాలను గమనించి  https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని కోరడమైనది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial