Top 10 Headlines Today:
ఇటు మోడీ... అటు ఎవరు.. ?
ఈ ప్రశ్న గడచిన రెండు జనరల్ ఎలక్షన్లలో బీజేపీ వేసింది. మూడోసారి అదే స్లోగన్ తో వెళ్లేందుకు సిద్ధమైంది. ఎన్నికలు ఎన్నాళ్లో లేవు కాబట్టి... బీజేపీ అడగకపోయినా.. ఇప్పుడు మనం ఓ మాట అనకుందాం.. మళ్లీ అదే ప్రశ్న... ఇటు మోడీ.. అటు ఎవరు..? పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఎందుకు మౌనం?
ఏపీ భారతీయ జనతాపార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి వైఎస్ఆర్‌సీపీ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఏపీని ఆదుకుందో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన పురందేశ్వరి జగన్ ప్రభుత్వంలో లోటుపాట్లను ఎత్తి చూపారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో చెప్పాలని.. రాష్ట్రంలో ఉన్న రోడ్ల పరిస్ధితి ప్రజలందరికీ తెలుసని జగన్ సర్కార్ పై మండిపడ్డారు. మహిళలకు రక్షణ కల్పించలేని పరిస్ధితుల్లో ఏపీ ప్రభుత్వం ఉందని.. మహిళలు మొబైల్ ఊపడానికే తప్ప దిశా ఎందుకు పనికిరావడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారారు. రెండేళ్లలోనే విభజన చట్టంలో చెప్పినట్టు జాతీయ విద్యా సంస్థలు అన్ని నెలకొల్పారన్నారు. విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ, పలు ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు తేలేదని.. జాకీ లాంటి సంస్థ కూడా వెళ్లిపోయిందంటూ మండిపడ్డారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
బొత్స సత్యనారాయణ మాటల ఆంతర్యమేంటి?
తెలుగు రాష్ట్రాల అధికార పార్టీల నేతల మధ్య గతంలో ఏదైనా అంశంపై వివాదం ఏర్పడితే మీడియాలో హైలెట్ అయ్యేది. కానీ ఈసారి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ .. తెలంగాణ విద్యా వ్యవస్థపై దారుణమైన ఆరోపణలు చేసినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ మంత్రులు గట్టిగానే ఖండించినా హైలెట్ కాలేదు. వ్యూహాత్మకంగా అక్కడ పవన్ కల్యాణ్.. తెలంగాణలో పవర్ ఇష్యూస్ ను డైవర్ట్ చేయడానికి రెండు పార్టీల నేతలు కలిసి ప్లాన్ చేశారు కానీ.. వర్కవుట్ కాలేదన్న అభిప్రాయం ఈ కారణంగానే ఏర్పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
విండీస్ విలవిల
వెస్టిండిస్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో జరిగిన ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుత ప్రదర్శన చేసింది. మూడో రోజు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌ను 421 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో విండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్ 130 పరుగులకే కుప్పకూలింది. భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై వడ్డీ రేటు
ఈ నెల ప్రారంభంలో, కొన్ని చిన్న మొత్తాల పొదుపు పథకాలపై (small savings schemes) వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం పెంచింది, కొన్ని స్కీమ్స్‌పై పాత ఇంట్రస్ట్ రేట్లనే కొనసాగించింది. పాత ఇంట్రస్ట్ రేట్ కొనసాగిన పథకాల్లో కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra) ఒకటి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వచ్చేశాయి
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ జులై 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. గ్రూప-1 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఏపీలో మొత్తం 111 గ్రూప్-1 పోస్టులకుగాను 259 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్స్ కేటగిరీ నుంచి ఎంపికయ్యారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన 6,455 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ఆగస్టు 29, 30 తేదీల్లో తెలంగాణ గ్రూప్-2 పరీక్ష
తెలంగాణలో గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఆగస్టు 29, 30 తేదీల్లో రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు జులై 14న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్ష కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు మినహా.. మిగతా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు యథావిధిగా నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో గ్రూప్-2 ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షలకు వారం ముందునుంచి హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.
టెస్లా వచ్చేస్తోంది
సుదీర్ఘ చర్చల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ఇప్పుడు భారతదేశంలో తన కార్లను తయారు చేసేందుకు సిద్ధం అయింది. బిజినెస్ టుడే కథనం ప్రకారం ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతదేశంలో తన తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి విక్రయించేందుకు ప్రాథమిక ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
కమిటీ హాల్‌కు చిరంజీవి పేరు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య పరిస్థితి ఉప్పు నిప్పు అన్నట్లు ఉంది. వారాహి యాత్రలో వైసీపీ మీద విమర్శలతో జనసేనాని చెలరేగుతున్నారు. ప్రతి విమర్శలతో వైసీపీ నేతలు సైతం బదులిస్తున్నారు. దాంతో వాతావరణం వేడెక్కుతోంది. ఈ తరుణంలో ఓ ఊరిలో కమ్యూనిటీ హాలుగా చిరు పేరును పెడుతున్నామని వైసీపీ ఎంపీ చెప్పడం విశేషమే. పూర్తి వివరాల్లోకి వెళితే. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
జులై 20 నుంచి నీట్ యూజీ- 2023 కౌన్సెలింగ్ ప్రారంభం
నీట్ యూజీ (NEET UG) 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 20 నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) జులై 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను చూసుకోవచ్చు. నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్(కేంద్రయూనివర్సిటీల్లో) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్, సెంట్రల్ యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 15శాతం ఆలిండియా కోటా సీట్లు, 85 శాతం స్టేట్ కోటా సీట్లతో కలిపి 100 శాతం సీట్లకు ఎంసీసీ/DGHS కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి