నీట్ యూజీ (NEET UG) 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 20 నుంచి ప్రారంభంకానుంది. కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) జులై 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూలును అందుబాటులో ఉంచింది. నీట్ యూజీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీలను చూసుకోవచ్చు. నీట్ యూజీ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోనిప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్(కేంద్రయూనివర్సిటీల్లో) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్స్, సెంట్రల్ యూనివర్శిటీలు, డీమ్డ్ యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్/డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం 15శాతం ఆలిండియా కోటా సీట్లు, 85 శాతం స్టేట్ కోటా సీట్లతో కలిపి 100 శాతం సీట్లకు ఎంసీసీ/DGHS కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
సీట్ల వివరాలు..
నీట్ అడ్మిషన్ ప్రక్రియలో వివిధ కేటగిరీల సీట్లు ఉంటాయి. ఈ జాబితాలో ఆల్ ఇండియా కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ కోటా సీట్లు, కేంద్రీయ సంస్థలు/యూనివర్సిటీలు/డీమ్డ్ యూనివర్సిటీ సీట్లు, ప్రైవేట్ మెడికల్/డెంటల్ కాలేజీలు లేదా ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీలో స్టేట్/మేనేజ్‌మెంట్/ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు, సెంట్రల్ పూల్ కోటా సీట్లు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్/ఎయిడెడ్ మైనారిటీ/నాన్-మైనారిటీ మెడికల్ కాలేజీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా అలాగే మేనేజ్‌మెంట్ సీట్లు, దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థలు/జిప్‌మర్ కోటా సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
నీట్ యూజీ 2023 తొలివిడత కౌన్సెలింగ్ ఇలా...
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 20న నీట్ మొదటివిడత కౌన్సెలింగ్ మొదలుకానుంది. అభ్యర్థులు జులై 20 నుంచి 25 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరు జులై 22 నుంచి 26 మధ్య ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. జులై 27, 28 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, జులై 29న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు జులై 30న పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఆగస్టు 9 నుంచి రెండో విడత కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2023 రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 9 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 14 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరు ఆగస్టు 10 నుంచి ఆగస్టు 15 మధ్య ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. ఆగస్టు 16, 17 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, ఆగస్టు 18న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు ఆగస్టు 19న పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు ఆగస్టు 20 నుంచి ఆగస్టు 28 వరకు సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఆగస్టు 31 నుంచి మూడో విడత కౌన్సెలింగ్..
నీట్ యూజీ 2023 రెండో విడత కౌన్సెలింగ్ ఆగస్టు 31 నుంచి ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 4 వరకు నిర్ణీత ఫీజు చెల్లించి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరు సెప్టెంబరు 1 నుంచి 5 వరకు ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. తర్వాత సెప్టెంబరు 6, 7 తేదీల్లో సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, సెప్టెంబరు 8న సీట్లను కేటాయిస్తారు. అభ్యర్థులు సెప్టెంబరు 9న పోర్టల్ ద్వారా డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందినవారు సెప్టెంబరు 10 నుంచి సెప్టెంబరు 18 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
మిగిలిపోయిన సీట్లకు...
మూడువిడతల కౌన్సెలింగ్ అనంతరం మిగిలినపోయిన సీట్లను సెంట్రల్ కౌన్సెలింగ్ ద్వారా భర్తీచేస్తారు. సెప్టెంబరు 21 నుంచి 23 మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సెప్టెంబరు 22 నుంచి 24 మధ్య ఆప్షన్ల నమోదు, లాకింగ్ ఉంటుంది. అభ్యర్థులు సెప్టెంబరు 25న సీట్ల కేటాయింపు ప్రక్రియను చేపట్టి, సెప్టెంబరు 26న సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందినవారు సెప్టెంబరు 27 నుంచి సెప్టెంబరు 30 మధ్య సంబంధిత కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, జులై 29 నుంచి రిజిస్ట్రేషన్!
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'టీఎస్ ఈసెట్-2023' కౌన్సెలింగ్ షెడ్యూలును అధికారులు ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం జులై 29 నుంచి రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ ప్రారంభంకానుంది. ఆగస్టు 1 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసిన అభ్యర్థులకు జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇక ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినవారు జులై 31 నుంచి ఆగస్టు 4 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈసెట్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు జులై 13న విడుదలైంది. ఆగస్టు 14 నుంచి 18 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఆగస్టు 16 నుంచి 19 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 16 నుంచి 21 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 25న తొలి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 1వ తేదీ నుంచి తుది విడత ఐసెట్ కౌన్సెలింగ్ ఉంటుంది. సెప్టెంబరు 1 నుంచి 3 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు, 7న తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబరు 8న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial