Horoscope Today July 15, 2023
మేష రాశి (Aries)
ఈరోజు ఈ రాశికి వ్యాపారులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మీ విశ్వాసం పెరుగుతుంది. అనవసర ఖర్చులను నియంత్రించండి. మీలో నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మధురంగా ఉంటుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
వృషభ రాశి ( Taurus)
ఈ రాశివారు వృత్తి వ్యాపారాలలో పురోగతిని పొందే అవకాశాలుఉన్నాయి. పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు. ఆర్థిక పరంగా పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. మీ వెనుక మిమ్మల్ని విమర్శించేవారున్నారు జాగ్రత్త. మీ రహస్య విషయాలను ఎవరితోనూ పంచుకోకండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద పెట్టాలి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించండి.
మిథున రాశి (Gemini)
ఈ రోజు ఈ రాశివారు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ల మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ఎదురైన సమస్యలు తొలగిపోతాయి. కొన్ని సమస్యలు పరిష్కారం అవడం వల్ల మీ ఒత్తిడి తొలగిపోతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీరు మీ పని శైలిలో అర్థవంతమైన మార్పులను తీసుకురావచ్చు. మీ మానసిక బలం పెరుగుతుంది. అనవసర ఆందోళనలకి దూరంగా ఉండండి .
Also Read: పెళ్లిలో సుముహూర్తం అంటే ఏంటి - జీలకర్ర బెల్లమే ఎందుకు పెడతారు!
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారు చేసే పనిపై శ్రద్ధ పెట్టాలి. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఎక్కువ దూరం ప్రయాణించవద్దు. ప్రేమ భాగస్వామితో వివాదం జరగొచ్చు. వైవాహిక జీవితంలో మాత్రం సంతోషం ఉంటుంది. అనుకున్న పనులు కొంత కష్టం తర్వాత నెరవేరుతాయి. కొత్తవ్యక్తులను అంత త్వరగా నమ్మేయవద్దు.
సింహ రాశి (Leo)
ఈ రాశివారు కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. సంపద పొందే అవకాశాలు ఉన్నాయి. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. మీ మాటతీరుతో ఆకట్టుకుంటారు. పిల్లల విజయాన్ని చూసి మీరు గర్వపడతారు. స్నేహితుల సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆదాయం బావుంటుంది.
కన్యా రాశి (Virgo)
ఈ రాశి ఉద్యోగులకు కార్యాలయంలో సమస్యలు తొలగిపోతాయి. మీరు మీ పని నాణ్యతను మెరుగుపరచుకోవాలి. మీ వ్యాపారానికి సంబంధించి పెద్ద లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. ఉన్నత విద్యాసంస్థల అడ్మిషన్లలో వస్తున్న అడ్డంకి తొలగిపోతుంది. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది.
తులా రాశి (Libra)
ఈ రాశివారు తప్పుడు సలహా ఇచ్చే వారికి దూరంగా ఉండండి. మతపరమైన ప్రయాణాలకు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఉద్యోగం మారాలని చూస్తున్నట్లయితే, ఈ రోజు చాలా మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.
వృశ్చిక రాశి (Scorpio)
మీ ఆలోచనల్లో ప్రతికూలత ఉంటుంది. ఆస్తులపై భారీ పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో పనిపై శ్రద్ధ వహించరు. కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అవసరమైన సమయంలో మీ సన్నిహితులు ఇచ్చే సలహాలను పాటించండి. మీరు ప్రారంభించే పనులకు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది.
Also Read: ఈ రెండు రకాల పెళ్లిళ్లు నిషిద్ధం - అవేంటంటే!
ధనుస్సు రాశి (Sagittarius)
ఈ రాశివారు తలపెట్టిన పనిని సకాలంలో పూర్తిచేస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. అవివాహితుల వివాహాలు స్థిరపడతాయి. వ్యాపారంలో పెద్ద ఆర్థిక లాభాన్ని కలిగి ఉండటం మీ విశ్వాసాన్ని పెంచుతుంది. చాలా కాలంగా ఆఫీసులో ఉన్న పనులు పూర్తి కాగలవు. కొన్ని విషయాల్లో సంయమనం పాటించండి. క్రమశిక్షణతో పనులు చేస్తూ విజయం సాధించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ద అవసరం.
మకర రాశి (Capricorn)
ఈ రాశి నిరుద్యోగులు కొత్త ఉద్యోగంలో చేరుతారు. కాస్త ఓపికగా వ్యవహరించండి. ఆశించిన ఫలితం పొందడానికి సమయం పడుతుంది. స్థిరాస్తి వ్యాపారంలో ధనలాభం ఉంటుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ కుటుంబంలో ప్రశాంతవాతావరణ నెలకొంటుంది. మీ ప్రణాళికలు ఫలిస్తాయి. వృత్తి, విద్యా, వ్యాపార రంగంలో ఉన్నవారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. మీ మనోబలంతో వాటిని జయించి ముందుకు సాగుతారు.
కుంభ రాశి (Aquarius)
మీ ఆలోచనలు, సూచనలు ప్రశంసలు అందుకుంటాయి. కుటుంబ సభ్యులపై అనవసర కోపం ప్రదర్శించకండి. వ్యసనానికి, చెడు అలవాటుకు దూరంగా ఉండండి. మీరు సృజనాత్మక పనులలో విజయం సాధిస్తారు. ప్రేమికులకు మంచి రోజు. ఆర్ధిక వనరులు పెరుగుతాయి. మీరు చేపట్టిన పనులన్నిటిలో విజయం సాధిస్తారు.
మీన రాశి ( Pisces)
ఈ రాశివారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పనిచేయాలన్నా తొందరపడకండి. మీ ప్రణాళికలో ఆకస్మిక మార్పు మీ పనిపై ప్రభావం చూపిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. నూతన పెట్టు బడులు, కొనుగోళ్లు, కలిసివస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.