Morning Top News: 


ఏపీలో డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ 


ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసులు సంచలనం రేపుతున్నాయి. అరెస్టు అవుతున్న వారు గత ఐదేళ్ల కాలంలో పెట్టిన పోస్టులు అత్యంత జుగుప్సాకారంగా ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో వారు ఆ సమయంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారని ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


చిన్నారిని పొట్టనపెట్టుకున్న శునకాలు  


ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని పెనుగంచిప్రోలులో విషాదం చోటుచేసుకుంది 10 వీధి కుక్కలు దాడిలో రెండేళ్ల బాలుడు మృతిచెందడంతో పసివాడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. పెళ్లయిన చాలా ఏళ్ళ తరువాత  పుట్టిన కొడుకు ఇలా అర్ధంతరంగా మృత్యువాతపడడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


నామినేటెడ్ పోస్టుల్లో వారికి అన్యాయం?   


ఏపీలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ కూడా పూర్తయింది. మొత్తం 59 మందికి వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి. మొదటి విడత 21, రెండో విడత 59 కలిపి  80 మందికి కీలక పదవులు దక్కాయి. అయితే ఈ రెండు లిస్టుల్లోనూ  స్థానం దక్కని  నలుగురు కీలక వ్యక్తులు ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొంటున్న నేతలు 


 తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుల గణన సర్వేకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని తన స్వగ్రామం కల్లూరుగూడాలో సోమవారం (నవంబర్ 11న) నిర్వహించిన సర్వేలో ఎమ్మెల్యే వెడ్మ బొబ్జు పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ఉత్తమ  ఉపాధ్యాయులకు అవార్డులు  


 ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జాతీయ విద్యా దినోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 166 మంది ఉత్తమ అధ్యాపకులు, ఉపాధ్యాయులను సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్  ఘనంగా సత్కరించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


అమృత్ టెండర్లలో అక్రమాలంటూ  కేటీఆర్ ఫిర్యాదు


కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే అమృత్ 2.0 స్కీమ్ టెండర్లలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగంతో పాటు అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఏమాత్రం అనుభవం, అర్హత లేని సంస్థకు కేవలం తన బావమరిది కంపెనీ అన్న కారణంతో ఇంత పెద్ద ఎత్తున పనులను కట్టబెట్టారని ఆరోపించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ భేటీ


టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు.  నారా లోకేష్‌తో పాటు ఇతర అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. పలు రంగాల్లో పెట్టుబడుల అంశాలపై చర్చించారు. టాటా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తో సమావేశం గురించి చంద్రబాబు సోషల్ మీడియాలో వివరాలు తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బంపరాఫర్


ప్రయాణికులకు టీడీఎస్ఆర్టీసీ  శుభవార్త అందించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్  బస్ పాస్ కలిగిన ప్రయాణికులు తమ వద్ద ఉన్న పాస్‌లతో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ - గరుడ తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్‌పై 10 శాతం రాయితీ పొందొచ్చని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 31 వరకూ ఈ 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


మణిపూర్‌లో భారీ ఎన్ కౌంటర్


మణిపూర్‌లో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఉగ్రమూకల్ని ఏరిపారేస్తోంది. జిరిబామ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో కనీసం 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో వెంటనే స్పందించిన బలగాలు కాల్పులను తిప్పికొట్టాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ కూడా గాయపడగా.. చికిత్స నిమిత్తం విమానంలో అతడ్ని ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..


జపాన్​లోప్రభాస్ కల్కీ 2898 AD గ్రాండ్  రిలీజ్ 


ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్​ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కించిన చిత్రం కల్కి 2898 ఏడి. తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ప్రస్తుతం జపాన్​లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. జపాన్ పరిశ్రమ దిగ్గజం కబాటా కైజో ఆధ్వర్యంలో ఈ సినిమాను 2025, జనవరి 3వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.  పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..