Arrested in social media cases are paid with public money: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసులు సంచలనం రేపుతున్నాయి. అరెస్టు అవుతున్న వారు గత ఐదేళ్ల కాలంలో పెట్టిన పోస్టులు అత్యంత జుగుప్సాకారంగా ఉన్నాయన్న అభిప్రాయం ఉంది. అదే సమయంలో వారు ఆ సమయంలో ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారని ఆధారాలు లభించినట్లుగా వర్రా రవీందారెడ్డిని అరెస్టు చేసిన విషయాన్ని ప్రెస్మీట్ పెట్టి చెబుతున్న సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. అంటే గత ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రజధనాన్ని సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలుగా ఇచ్చి ప ్రతిపక్ష నేతల్ని. వారి కుటుంబీకుల్ని తిట్టించారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అరెస్టు అవుతున్న వారిలో ఎక్కువ మందికి డిజిటల్ కార్పొరేషన్ పే రూల్స్
వర్రా రవీందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ తో పాటు సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారిలో అత్యధిక మంది గత ఐదేళ్లుగా డిజిటల్ కార్పొరేషన్ నుంచి జీతాలుగా తీసుకున్నారు. ఈ విషయాన్ని డీఐజీ ప్రవీణ్ కోయ కూడా చెప్పారు. వారు డిజిటల్ కార్పొరేషన్‌లో ప్రత్యేకంగా చేసిన ఉద్యోగం ఏమీ లేదు. సోషల్ మీడియా పోస్టులు వైసీపీకి అనుకూలంగా పెట్టడమే. పార్టీ పని కోసం ప్రజాధనంతో సోషల్ మీడియా కార్యకర్తలకు జీతాలిచ్చారని తాజాగా ఈ కేసులో బయటపడినట్లయింది. గతంలోనే ఈ అంశంపై పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా జీతాలు తీసుకున్న వారు గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపైనా తప్పుడు పోస్టులు పెట్టారని గుర్తించారు. ఇప్పుడీ వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
ఏమిటీ డిజిటల్ కార్పొరేషన్ !
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఐ డ్రీమ్ అనే యూట్యూబ్ చానళ్ల గ్రూపును నడిపే చిన్న వాసుదేవరెడ్డి అనే వ్యక్తిని దీనికి చైర్మన్ గా నియమించారు. ఆ డీజిటల్ కార్పొరేషన్ లక్ష్యం ప్రభుత్వ డిజిటల్ ప్రచారాన్ని చూసుకోవడం. అలాగే ప్రజలకు డిజిటల్ సమాచారాలను చేరవేయడం. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టారు. అయితే నియామకాల గురించి మాత్రం ఎప్పుడూ బయటకు రాలేదు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు పెద్ద ఎత్తున ఈ కార్పొరేషన్ కింద జీతాలు చెల్లించినట్లుగా తాజాగా వెలుగులోకి రావడం సంచలనాత్మకం అవుతోంది.
Also Read: 'అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది' - మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
సమగ్రమైన దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయా ?
సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిని ఏ మాత్రం క్షమించకూడదని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. అంతా వ్యవస్థీకృతంగా జరిగిన నేరం కాబట్టి సూత్రధారుల్ని కూడా బయటకు లాగాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే సజ్జల భార్గవ్ రెడ్డిని ఏ వన్ గా పెట్టి కేసు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించిన వారందరి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కేసుపై పోలీసులు విచారణ ప్రారంభిస్తే ఎంత లోతుగా వెళ్తుందో చెప్పడం కష్టమని పోలీసు వర్గాలే అంచనా వేస్తున్నాయి. ఇందులో ప్రజాధనాన్ని పార్టీ కార్యకర్తలకు వినియోగించడం.. వారు అసాంఘిక శక్తుల మాదిరిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా చాలా పెద్ద విషయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. అందుకే ముందు ముందు ఈ కేసు వ్యవహరాలు మరింత సంచలనం అయ్యే అవకాశం ఉంది.