Top 10 Headlines Today: 


కాంగ్రెస్‌లో ఫ్రీఫైర్‌


తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇటీవలి కాలంలో ఐక్యత కనిపించిందన్న అభిప్రాయం వినిపించింది. కానీ అలాంటిదేమీ లేదని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. రేవంత్‌ను టార్గెట్ చేసుకునే అవకాశం వస్తే సీనియర్లు.. పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా తగ్గరని మరోసారి తేలిపోయిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి కారణం.. ఉచిత విద్యుత్ విషయంలో అమెరికాలో రేవంత్ రెడ్డి చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ ట్విస్ట్ చేసి ఆందోళనలు చేస్తే.. వాటిని గట్టిగా ఖండించకోవాల్సిన కాంగ్రెస్ రెండుగా విడిపోయింది. రేవంత్ ను ఇరికించేలా కొంతమంది మాట్లాడితే.. మరికొందరు.. బీఆర్ఎస్ పై మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పొత్తులపై క్లారిటీ వచ్చిందా?


ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల రాజకీయాలు ఓ క్లారిటీకి రావడం లేదు. టీడీపీ ఎవరితో కలుస్తుంది.. జనసేన టీడీపీతో కలుస్తుందా లేదా ..ఇంతకీ బీజేపీ వైఖరీ ఏంటి ? అంటూ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఓ వైపు అధికారపక్షం  విపక్ష కూటమి ఏర్పడకూడదని ప్రయత్నాలు చేస్తోంది. మరో వైపు ఇతర పార్టీలు పొత్తుల చర్చలు జరుపుతున్నాయో లేదో స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో.. కేంద్ర మంత్రి నారాయణస్వామి అనంతపురం జిల్లాకు వచ్చారు. ఏపీలో పొత్తులు ఉంటాయని.. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అయితే నారాయణ స్వామి మాటలకు అంత ప్రాధాన్యం లభించలేదు. కానీ.. అదే పొత్తు ఉంటుందన్న సంకేతాలను మెల్లగా ప్రజల్లోకి  పంపారన్న అభిప్రాయం మాత్రం బలపడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు


నిన్నటి ఆవర్తనం ఈ రోజు నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కిమీ నుండి 7.6 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈరోజు దిగివ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ వైపు నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. రాగల మూడు రోజులు రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు భారీ వర్షాలు ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి.


 


శ్రీశైలంలో నీరు దొంగిలించారట! 


వర్షాకాలం వచ్చినా వానలు పడటం లేదు. రిజర్వాయర్లలో నీళ్లు లేవు. శ్రీశైలం పూర్తిగా వట్టిపోయింది. అయితే హఠాత్తగా  శ్రీశైలం రిజర్వాయర్లో నీటి దొంగతనం జరిగిందని  కొంత మంది పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఎవరు శ్రీశైలం నీటిని దొంగతనం చేశారు? ఎందుకు చేశారు? పోలీసులు కనిపెట్టగలరా అన్న చర్చ ప్రారంభమయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే 


ప్రైవేటు సహా అన్ని రకాల పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చేసిన చట్టాలను మరింత సమర్థంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటైన, నిర్మాణంలో ఉన్న, రాబోతున్న పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సూచించారు. చట్టం అమలవుతున్న తీరుపై కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని.. ప్రతి 6 నెలలకు ఓసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రోజుకో మలుపు


తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. దాదాపు నాలుగు నెలలుగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు నమోదైన అరెస్టులు 78కి చేరాయి. గడచిన రెండు రోజుల్లోనే 21 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో కనీసం 150 మంది వరకూ అరెస్ట్ అవుతారని భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


'ఆదిత్య 999'తో మోక్షజ్ఞ ఎంట్రీ!


గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)  తనయుడు వెండితెరకు ఎప్పుడు పరిచయం అవుతున్నారు? నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు? నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అట్టహాసంగా తానా మహాసభల్లో ఈ ప్రశ్నలకు ఆఫ్ ది రికార్డ్ బాలకృష్ణ సమాధానం చెప్పారట. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి


ఇవాళ (బుధవారం) ఉదయం 8.05 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 3 పాయింట్లు లేదా 0.01 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,539 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


సత్తా చాటిన బోపన్న జోడీ


వింబుల్డన్ 2023 పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌ తో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ భారత్- ఆస్ట్రేలియా ద్వయం మూడో రౌండ్లో 7-5, 4-6, 7-6 (10-5) తేడాతో డేవిడ్ పెల్, రీస్ స్టాడ్లర్ జోడీపై ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. తొలి సెట్ టై బ్రేకర్ లో నెగ్గిన 6వ సీడ్ జోడీ 7-5 తో నెగ్గింది, రెండో సెట్ ఓడినా, మూడో సెట్ లో రాణించి క్వార్డర్స్ లో అడుగుపెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఎందుకంత ప్రమాదకరం?


చెట్లు అనగానే ఆక్సిజన్‌ని మనకు అందించి కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకోవడం అనే దృగ్విషయమే గుర్తొస్తుంది. అందుకే చెట్లు మనకి ప్రాణాన్ని పోస్తాయని చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఒక రకమైన చెట్టు మాత్రం మన ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకాడదు. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తింపు పొందింది. ఈ విషపూరితమైన చెట్లు కింద నిలుచున్నా కూడా ఎంతో కొంత హాని జరగడం ఖాయం. ఈ చెట్టు నుంచి వీచే గాలి కూడా ప్రమాదకరం. ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు... ఎన్నో అధ్యయనాలు తర్వాత శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఈ చెట్టు పేరు ‘మంచినీల్’. దీనిని చూస్తే యాపిల్ చెట్టును చూసినట్టే ఉంటుంది. ఆకులు కూడా ఆపిల్ చెట్టుని ఆకులానే ఉంటాయి. ఎక్కువగా ఇది సముద్రపు ఒడ్డున మాంగ్రూవ్ చెట్ల మధ్యలో పెరుగుతుంది. అందుకే దీన్ని బీచ్ ఆపిల్ చెట్టు అని కూడా పిలుస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి