వింబుల్డన్ 2023 పురుషుల డబుల్స్‌లో భారత వెటరన్ రోహన్ బోపన్న అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌ తో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ భారత్- ఆస్ట్రేలియా ద్వయం మూడో రౌండ్లో 7-5, 4-6, 7-6 (10-5) తేడాతో డేవిడ్ పెల్, రీస్ స్టాడ్లర్ జోడీపై ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. తొలి సెట్ టై బ్రేకర్ లో నెగ్గిన 6వ సీడ్ జోడీ 7-5 తో నెగ్గింది, రెండో సెట్ ఓడినా, మూడో సెట్ లో రాణించి క్వార్డర్స్ లో అడుగుపెట్టింది.


మిక్స్ డబుల్స్ లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన బోపన్న పురుషుల డబుల్స్ లో సత్తా చాటుతున్నాడు. మూడో రౌండ్లో మూడో సెట్ లో టై బ్రేకర్ లో వరుస పాయింట్లతో నెగ్గి, సెట్ తో పాటు మ్యాచ్ నెగ్గారు బోపన్న, మాథ్యూ ఎబ్డెన్. తద్వారా క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. అయితే భారత వెటరన్ ఆటగాడు బోపన్న వింబుల్డన్ లో బెస్ట్ అంటే.. 2013, 2015లో సెమీస్‌ వరకు (డబుల్స్‌ విభాగంలో) చేరుకున్నాడు.