ఉత్తర భారతంలో వరదల వల్ల అక్కడి జనజీవనం అతలాకుతలం అవుతోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ వరదలు భీభత్సం రేపుతుండగా, అక్కడ తెలంగాణకు చెందిన వారు చిక్కుకుపోయారు. వీరు ఉస్మానియా మెడికల్ కాలేజీలో జనరల్ మెడిసిన్ చదువుతున్నారు. ఈ మెడికల్ స్టూడెంట్స్ జూన్ నెల 28న ఇంకో ఇద్దరు స్నేహితులతో కలిసి లద్దాఖ్, మనాలి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. వారు ఈ నెల 8న మనాలి నుంచి స్నేహితులతో ఫోన్లో మాట్లాడారు. ఆ తర్వాత వారు ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు. వరదల్లో చిక్కుకున్న మెడికోల గురించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆరా తీశారు. వారి ఆచూకీ తెలుసుకోవాలని, డాక్టర్లను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
Himachal Floods: వరదల్లో చిక్కుకున్న తెలంగాణ డాక్టర్లు, మంత్రి హరీశ్ కీలక ఆదేశాలు
ABP Desam
Updated at:
11 Jul 2023 08:11 PM (IST)
మెడికల్ స్టూడెంట్స్ జూన్ నెల 28న ఇంకో ఇద్దరు స్నేహితులతో కలిసి లద్దాఖ్, మనాలి పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది.
ఉత్తరాదిన వరదలు