Top 10 Headlines Today: 


చల్లని కబురు


నేడు దక్షిణ ఛత్తీస్ గఢ్ & పరిసరాల్లోని ఒడిశాలో ఒక ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 1.5 కిమీ ఎత్తు వరకు వ్యాపించి ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం (జూన్ 9) ఓ ప్రకటనలో తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య మరియు పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


బీజేపీ బిగ్ ప్లాన్


2024 ఎన్నికలకు బీజేపీ బిగ్ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. అటు కాంగ్రెస్‌ విపక్షాలను ఒక్కటి చేసే పనిలో బిజీగా ఉంది. అయితే...బీజేపీ ప్లాన్ కాస్త భారీగా ఉన్నట్టుగానే తెలుస్తోంది. దేశంలోనే అత్యధిక ఎంపీ సీట్‌లు ఉన్న యూపీపై స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతోంది కాషాయ పార్టీ. యూపీలో 80 ఎంపీ స్థానాలున్నాయి. ఇక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకుని అత్యధిక సీట్లు సాధిస్తే బీజేపీకి పట్టు దొరుకుతుంది. అందుకే...ఇక్కడ కుల సమీకరణలపై దృష్టి పెట్టింది. ఓబీసీ ఓటర్లను ఆకట్టుకోవాలని భావిస్తోంది. అందుకు తగ్గ బ్రహ్మాస్త్రం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఓబీసీ వర్గానికి చెందిన కీలక నేతలు, ఓటర్లతో ప్రత్యేకంగా చర్చించనుంది. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ వర్గంలో వెనకబడిన వాళ్లకు సంక్షేమ ఫలాలు అందేలా వ్యూహాలు రచించనుంది. వీటితో పాటు ఓబీసీ మోర్చా నేతృత్వంలో "థాంక్యూ మోదీ" కాన్ఫరెన్స్ ఏర్పాటుచేయనుంది. యూపీలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లలో ఈ కాన్ఫరెన్స్ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అన్ని జిల్లాల్లోనూ విస్తృతంగా ప్రచారం చేస్తూ...ఓబీసీ ఓటర్లకు దగ్గరవ్వాలని బీజేపీ భావిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


మంత్రులపై చంద్రబాబు పంచ్‌లు


ఉదయం లేచింది మొదలు తనను తిట్టడమే మంత్రులకు పెద్దపని ఏపీ మంత్రులపై టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు వేశారు.  తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వింగ్ ఐ టీడీపీ సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ మహానాడులో  విడుదల చేసిన మేనిఫెస్టో  వివరాలను సోషల్ మీడియా  లో విస్తృత ప్రచారం కల్పించింది ఐ-టీడీపీ నే అని ప్రశంసించారు.  బీసీ (BC)ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం (Special Act) తెస్తామని, ప్రస్తుత పరిస్థితుల్లో బీసీలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని.. అభద్రతకు గపరవుతున్నారని అన్నారు. బీసీలపై దాడులు పెరుగుతున్నాయని, వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం అవసరమని అన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


12 నుంటే స్కూల్స్


సోషల్‌ మీడియాలో తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్‌ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జూన్‌ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నట్టు శుక్రవారం (జూన్ 9న) స్పష్టతనిచ్చింది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే స్కూల్స్ తెరుచుకోనున్నాయి. దీంతో, విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. పాఠశాలలకు సెలవుల పొడిగింపు లేదని పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


కాంగ్రెస్, బీజేపీ తీరుతోనే సింగరేణికి ముప్పు: కేసీఆర్


సింగరేణి సంస్థని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందని కేసీఆర్ విమర్శించారు. ఆ పార్టీ చేసిన అప్పులు తీర్చలేకే సింగరేణిలో 49 శాతాన్ని కేంద్రానికి అప్పగించిందని ఆరోపించారు. మంచిర్యాలలో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించిన అనంతరం.. ప్రగతి నివేదన సభ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. 2014 కంటే ముందు సింగరేణి కార్మికుల‌కు ఇచ్చే బోన‌స్ 18 శాతం మాత్రమే ఉండేదని కేసీఆర్ గుర్తు చేశారు. అంటే కేవ‌లం రూ.50 నుంచి 60 కోట్లు మాత్ర‌మే కార్మికుల‌కు పంచేదని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పంతులుగారూ పంతులుగారూ అంటే ప్రాణం తీశాడు


హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన అప్సర అనే యువతి  హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. పూజారి అయినప్పటికీ అత్యంత క్రిమినల్ మైండ్‌తో వ్యవహరించాడు. హత్య చేసి ఇంటికి సమీపంలోనే మ్యాన్ హోల్ పడేసి.. ఎవరికీ తెలియకుండా.. తెలియనట్లుగా వారం రోజుల పాటు వ్యవహరించాడు.చివరికి బయటపడిన తర్వాత కూడా పూజారి వ్యవహారశైలి తేడాగా ఉండటం పోలీసుల్నిసైతం ఆశ్చర్య పరిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


పేర్ని ప్రశంసలు


చెప్పాడంటే చేస్తాడంతే.. అనే నమ్మకం కలిగించటంలో ముఖ్యమంత్రి జగన్ సక్సెస్ అయ్యారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సెల్ఫీ దిగలేదని తెలగు దేశం కార్యకర్త నారా లోకేష్ పై కోడిగుడ్లు వేస్తే ప్రభుత్వానికేంటి సంబంధమని ఆయన ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


వరుణలావణ్యం


టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. మణికొండలోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీ సభ్యులంతా హాజరై సందడి చేశారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో వరుణ్, లావణ్యలు ఉంగరాలు మార్చుకున్నారు. ఈ సమాచారం బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియా ద్వారా వరుణ్, లావణ్యలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంగేజ్మెంట్‌ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘Found my Lav’ అంటూ వరుణ్, ‘Found my Forever’ అంటూ వరుణ్, లావణ్యలు తమ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్, ఉపాసన, అల్లు అర్జున్ ఫ్యామిలీలు నాగబాబు ఇంటికి వెళ్తున్న ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


రిపేర్‌కే అంత ఖర్చా?


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేష్‌ అంబానీ పెద్ద కోడలు మరోమారు వార్తల్లోకి వచ్చారు. అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ, ఆయన భార్య శ్లోక మెహతా ఇటీవలే రెండోసారి తల్లిదండ్రులయ్యారు. గత నెల 31న  (31 మే 2023), శ్లోక మెహత హాస్పిటల్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వీరికి ఈ పాప రెండో సంతానం. ఈ దంపతులకు తొలి సంతానంగా, కుమారుడు పృథ్వి 2020 డిసెంబర్‌లో జన్మించాడు. ఆకాశ్‌ అంబానీ, శ్లోక మెహత 2019 మార్చి నెలలో వివాహం చేసుకున్నారు. ఆ పెళ్లి సందర్భంగా, మామ ముఖేష్ అంబానీ & అత్త నీత అంబానీ పెద్ద కోడలికి అత్యంత విలువైన, అరుదైన గిఫ్ట్‌ ఇచ్చారు. అది ఒక డైమండ్‌ నెక్లెస్‌. దాని విలువ 451 కోట్ల రూపాయలు. 91 వజ్రాలతో దానిని డిజైన్‌ చేశారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి


 


ఆస్ట్రేలియాదే పై చేయి


వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై ఆస్ట్రేలియా పట్టుబిగించింది.  భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో  296 పరుగులకే ఆలౌట్ చేసి 173 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 123 పరుగులు చేసింది. మార్నస్ లబూషేన్ (118 బంతుల్లో 41 బ్యాటింగ్, 4 ఫోర్లు), కామెరూన్ గ్రీన్ (27 బంతుల్లో 7 నాటౌట్, 1 ఫోర్) క్రీజులో ఉన్నారు.  తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 296  పరుగులకే ఆలౌట్ చేయడంతో దక్కిన ఆధిక్యంతో పాటు మూడో రోజు ఆటముగిసే సమయానికి చేసిన  పరుగులతో  ఆసీస్ ఆధిక్యం సుమారు 300 (296 పరుగులు) కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి