సోషల్ మీడియాలో తెలంగాణలో పాఠశాలలకు సెలవులు పొడిగిస్తారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో స్కూల్స్ ప్రారంభంపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జూన్ 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నట్టు శుక్రవారం (జూన్ 9న) స్పష్టతనిచ్చింది. దీంతో ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే స్కూల్స్ తెరుచుకోనున్నాయి. దీంతో, విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. పాఠశాలలకు సెలవుల పొడిగింపు లేదని పొడిగింపు లేదని అధికారులు ప్రకటించారు.
ఏపీలోనూ జూన్ 12 నుంచే...
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. జూన్ 12న పల్నాడు జిల్లా క్రోసూరులో సీఎం జగన్.. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్‌లను అందజేస్తారని తెలిపారు. సుమారు రూ.2500తో జగనన్న విద్యా కానుక కిట్‌లు ఇస్తున్నట్టు చెప్పారు. టెన్త్, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సీఎం చేతుల మీదుగా సత్కరిస్తామన్నారు. విద్యా కానుక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి బొత్స తెలిపారు. అలాగే జూన్ 28న నాలుగో విడత అమ్మఒడి నిధులను సీఎం విడుదల చేస్తారని వెల్లడించారు. మొదటి దశలో 12వేల పాఠశాలల్లో సాంకేతికత ద్వారా విద్య అందిస్తామన్నారు. రాష్ట్రంలో గోరు ముద్ద ద్వారా మంచి భోజనం అందిస్తున్నామని బొత్స వివరించారు.
Also Read:
తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల
తెలంగాణలోని పాఠశాలలకు సంబంధించిన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రభుత్వం జూన్ 6న విడుదల చేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతులకు కొత్త అకడమిక్ క్యాలెండర్ వర్తించనుంది. ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేయనున్నాయి. స్కూళ్లు జూన్ 12న ప్రారంభమై.. ఏప్రిల్ 23న ముగియనున్నాయి. అంటే ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి.
అకడమిక్ క్యాలెండర్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..
విద్యార్థులకు నాలుగో శనివారం 'నో బ్యాగ్' డే!
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి నెల నాలుగో శనివారాన్ని 'నో బ్యాగ్ డే'గా పాటించాలని నిర్ణయించింది. విద్యార్థులు ఆరోజు బ్యాగ్ లేకుండానే స్కూల్‌కు రావాల్సి ఉంటుంది. ఈ మేరకు కొత్త విద్యా సంవత్సరానికి(2023-24) సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ జూన్ 6న జారీ చేశారు. దీంతో ఏడాదిలో మొత్తం 10 రోజుల పాటు పిల్లలు స్కూల్ బ్యాగులు లేకుండానే బడికి వెళ్లనున్నారు. ఆరోజు వారితో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న దానిపై త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
పూర్తివివరాలు కోసం క్లిక్ చేయండి..
పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్‌షిప్ వివరాలు ఇలా!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2023 విద్యా సంవత్సరం ఇంటర్ చదువుతున్న 120 మంది పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్‌లు విద్యాధన్ పేరిట సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అందజేస్తోంది. 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జూన్ 15, తెలంగాణ విద్యార్థులు జూన్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.60 వేల వరకు స్కాలర్‌షిప్‌లు అందచేస్తారు.
స్కాలర్‌షిప్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..