హైద‌రాబాద్‌లో జూన్ 11న (ఆదివారం) నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు శుక్రవారం (జూన్ 9) ఆర్టీసీ గ్రేటర్‌ జోన్‌ అధికారులు వెల్లడించారు. నగర పరిధిలో గ్రూప్‌-1 ప్రిలిమిన‌రీ పరీక్షలకు దాదాపు 50 వేలకు పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. దీంతో అభ్యర్థుల‌ను వారి వారి ప‌రీక్షా కేంద్రాల‌కు చేర‌వేసేందుకు న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు.


ప్రత్యేక బ‌స్సులు ఉద‌యం నుంచి మ‌ధ్యాహ్నం వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌న్నారు. బస్సుల రాకపోకల కోసం కోఠి, సికింద్రాబాద్ బస్టాండ్‌ల‌లో రెండు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కోఠిలో 9959226160, సికింద్రాబాద్‌లో 9959226154 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలన్నారు.


టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకారం జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. 


గ్రూప్-1 అభ్యర్థులకు సూచనలు..


➥ ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వరు.


➥ ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్ చేయాలి. 


➥ సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్ ఉపయోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన పత్రాలు చెల్లుబాటు కావు. 


➥ అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్ కార్డు/పాన్ కార్డు లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకురావాలి. 


➥ ఎవరైనా అభ్యర్థులు అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తారని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. 


నిబంధనలను అతిక్రమిస్తే డీబారే..
సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఇక నుంచి ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కమిషన్ నిబంధనల ప్రకారం భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు రాయకుండా డిబార్ చేయాలని నిర్ణయించింది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో సంబంధాలున్న 50 మందిని రెండు రోజుల వ్యవధిలో కమిషన్ డిబార్ చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష కేంద్రాల్లో అల్లరి చేసినా, ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడినా పోలీసు కేసులతో పాటు చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.


Also Read:


DRDO: డీఆర్‌డీఓ ఆర్‌ఏసీలో 181 సైంటిస్ట్‌ పోస్టులు, ఈ అర్హతలుండాలి!
ఢిల్లీలోని డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ) ఆధ్వర్యంలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి మే 25న నోటిఫికేషన్ వెలువడింది. త్వరలోనే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన నాటినుంచి 21 రోజుల్లో అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. గేట్‌ స్కోర్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ మాస్టర్స్‌డిగ్రీ ఉత్తీర్ణత. గేట్‌ పరీక్షలో అర్హత సాధించాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.. 


టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు, ఎంపికైతే ఏడాదికి రూ.7లక్షల జీతం!
టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ లేదా ఎంటెట్/ఎంఎస్సీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు జూన్ 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.
పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...