మంగళగిరి నుంచి ఊహించని అభ్యర్థి
వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నియోజకవర్గాల్లో ఒకటి మంగళగరి. టీడీపీ యువనేత నారా లోకేష్ ఒక సారి అక్కడ్నుంచి పోటీ చేసి ఓడిపోయారు. రెండో సారి అక్కడ్నుంచే పోటీ చేయబోతున్నారు. ఓడినప్పటికీ నియోజకవర్గాన్ని అంటి పెట్టుకునే పని చేసుకుంటున్న ఆయన.. సొంత ఖర్చుతో ప్రజల్ని ఆదుకుంటున్నారు. మరో వైపు పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తోంది. బీసీ మంత్రం పాటిస్తూ.. లోకేష్ కు చెక్ పెట్టాలని వైసీపీ అధినాయకత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పలువురు టీడీపీ నేతల్ని పార్టీలో చేర్చుకున్నారు. వారెవరూ సరితూగే పరిస్థితి లేదని క్లారిటీ రావడంతో కొత్త అభ్యర్థిని ఖరారు చేశారని అంటున్నారు. ఇంకా చదవండి
టీటీడీ చైర్మన్ రేసులో మరో ఇద్దరు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే మంత్రి పదవి కంటే ఎక్కువ. అలాంటి పదవి కోసం ఎంత తీవ్ర ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. గత ఎన్నికల్లో లోక్ సభ టిక్కెట్ నిరాకరించడంతో వైవీ సుబ్బారెడ్డిని బుజ్జగించడానికి ఆధికారంలోకి రాగానే టీటీడీ చైర్మన్ పోస్టును ఇచ్చారు సీఎం జగన్. తర్వాత కొనసాగించారు. వచ్చే నెల పదో తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. కొత్త టీటీడీ బోర్డును నియమించాల్సి ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా చదవండి
ఫ్యామిలీతో వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిసిన బ్రహ్మానందం, ఎందుకంటే!
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. కుటుంబ సమేతంగా ప్రగతి భవన్‌కు వెళ్లిన ఆయన తన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహానికి రావాలని సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. భార్య, పెద్ద కుమారుడు గౌతమ్ తో కలిసి ప్రగతి భవన్ కు వెళ్లిన బ్రహ్మానందం తన కుమారుడు సిద్ధార్థ్ మ్యారేజ్ వెడ్డింగ్ కార్డును అందజేసి పెళ్లికి వచ్చి వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కేసీఆర్‌కు అందజేశారు. ఈ చిత్రపటాన్ని బ్రహ్మానందం స్వయంగా గీయడం విశేషం. ఇంకా చదవండి
మరో అల్పపీడనం! - నేడు వర్షాలు తక్కువే
‘‘గంగా పశ్చిమ బెంగాల్, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ పశ్చిమ బంగాల్ తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ. వరకూ విస్తరించి ఉంది. నిన్న 18°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిమీ ఎత్తు వద్ద ఉన్న షీయర్ జోన్ ఈ రోజు బలహీన పడింది. ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు శనివారం (జూలై 29) ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంకా చదవండి
మదనపల్లె మార్కెట్‌లో రూ.200 పలికిన టమాటా ధర, ఆల్ టైమ్ రికార్డ్ ప్రైస్
గత నెల రోజుల నుంచి దేశ వ్యాప్తంగా సామాన్యులకు భయపెడుతున్న అంశాల్లో టమాటా ఒకటి. వంటింటి సరుకు అయిన టమాటా రికార్డు ధరలు పలుకుతోంది. ఇప్పటికే కొందరు వంటకాలలో టమాటాను తగ్గించగా, కొందరు ఏకంగా టమాటా కొనడం మానేసే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో టమాటా రికార్డు ధర పలికింది. కిలో టమాటా ధర ఏకంగా రూ.196 నుంచి రూ.200కు చేరి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఏపీ, తెలంగాణలో కొందరు రైతులు నెల రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు సంపాదించారు. ఇంకా చదవండి
ఇక చదువులన్నీ మాతృభాషలోనే, స్పష్టం చేసిన ప్రధానమంత్రి మోదీ
దేశంలోని చదువులన్నీ ఇక మాతృభాషలోనే సాగనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నూతన విద్యావిధానంతో భారత్‌లోని భాషలన్నింటికి గౌరవం తేనున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రధానమంత్రి శనివారం(జులై 29) న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ‘అఖిల భారత శిక్షా సమాగం’ మూడో వార్షికోత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సాంఘిక శాస్త్రం నుంచి ఇంజినీరింగ్ వరకు బోధన ఇక మాతృభాషలోనే జరగనుందని చెప్పారు. ఇంకా చదవండి
వెంకీ అట్లూరి - దుల్కర్ సల్మాన్ మూవీకి ఇంట్రెస్టింగ్ టైటిల్ - ఆకట్టుకుంటున్న పోస్టర్!
మలయాళం లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ 'సీతారామం' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి ఎంతో దగ్గరయ్యాడు. అంతకుముందు పలు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన దుల్కర్.. 'సీతారామం' సక్సెస్ తో ఏకంగా తెలుగులో స్ట్రైట్ మూవీ చేస్తున్నాడు. హను రాఘవపూడి తెరకెక్కించిన 'సీతారామం' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి క్లాసిక్ లవ్ స్టోరీ గా నిలిచిపోయింది. తెలుగు ప్రేక్షకులు సైతం సినిమాలో దుల్కర్, మృనాల్ ఠాగూర్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే దుల్కర్ ఇప్పుడు నేరుగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తో స్ట్రైట్ తెలుగు మూవీ చేస్తున్నాడు. రీసెంట్ గానే 'సార్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి తన నెక్స్ట్ సినిమాకి హీరోగా దుల్కర్ సల్మాన్ ని ఎంపిక చేసుకున్నాడు. ఇంకా చదవండి
రజనీకాంత్‌ను ఎగతాళి చేస్తావా? నువ్వెందుకు సూపర్ స్టార్ కాలేదురా?
హిందీ చిత్ర పరిశ్రమలో కమాల్ ఆర్ ఖాన్ (Kamaal R Khan) అని ఓ నటుడు ఉన్నారు. కేఆర్కేగా సోషల్ మీడియాలో పాపులర్. హిందీలో ఆరు సినిమాలు చేశారు. 'బిగ్ బాస్' సీజన్ 3లోనూ పార్టిసిపేట్ చేశారు. స్క్రీన్ మీద కనిపించేది తక్కువ... సోషల్ మీడియాలో విమర్శలు చేయడం ఎక్కువ! విమర్శలు చేస్తూ పాపాలారిటీ పొందడం ఆయన స్టయిల్. లేటెస్టుగా రజనీకాంత్ మీద కామెంట్స్ చేశారు. దాంతో సూపర్ స్టార్ అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు... దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇంకా చదవండి
త్వరలో నాలుగు కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయనున్న టాటా - పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ కూడా!
టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో అమ్మకాల పరంగా హ్యుందాయ్ మోటార్ ఇండియాను అధిగమించి దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీదారుగా అవతరించడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. దీని కోసం కంపెనీ రాబోయే కొన్ని నెలల్లో కొత్త ట్రిమ్‌లు, ప్రత్యేక ఎడిషన్‌లు, ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌లతో కొన్ని మోడళ్లను విడుదల చేయనుంది. ఇంకా చదవండి
వెస్టిండీస్‌పై కుప్పకూలిన టీమిండియా - రెండో వన్డేలో 181 పరుగులకే ఆలౌట్!
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేస్తూ 40.1 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (55: 55 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వెస్టిండీస్ బౌలర్లలో మోతీ, రొమారియో షెపర్డ్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ఇంకా చదవండి