హిందీ చిత్ర పరిశ్రమలో కమాల్ ఆర్ ఖాన్ (Kamaal R Khan) అని ఓ నటుడు ఉన్నారు. కేఆర్కేగా సోషల్ మీడియాలో పాపులర్. హిందీలో ఆరు సినిమాలు చేశారు. 'బిగ్ బాస్' సీజన్ 3లోనూ పార్టిసిపేట్ చేశారు. స్క్రీన్ మీద కనిపించేది తక్కువ... సోషల్ మీడియాలో విమర్శలు చేయడం ఎక్కువ! విమర్శలు చేస్తూ పాపాలారిటీ పొందడం ఆయన స్టయిల్. లేటెస్టుగా రజనీకాంత్ మీద కామెంట్స్ చేశారు. దాంతో సూపర్ స్టార్ అభిమానులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు... దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
లుక్, యాటిట్యూడ్ ఉంటే చాలు... రజనీలా!
'జైలర్' సినిమా ఆడియోను శుక్రవారం చెన్నైలో విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో రజనీకాంత్ ఫోటోలను ట్వీట్ చేసిన కమాల్ ఆర్ ఖాన్ ''సూపర్ స్టార్ కావడానికి పర్సనాలిటీ, చదువు, హైట్ వంటివి ఏవీ అవసరం లేదని చెప్పడానికి రజనీకాంత్ ప్రూఫ్. మీకు అదృష్టం, యాటిట్యూడ్ ఉంటే చాలు'' అని పేర్కొన్నారు. ఆ ట్వీట్ మీద రజనీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
నువ్వెందుకు సూపర్ స్టార్ కాలేదు?
''హైట్, పర్సనాలిటీ నీ దగ్గర కూడా లేవు. కానీ, యాటిట్యూడ్ చాలా ఉంది. మరి, నువ్వు ఎందుకు సూపర్ స్టార్ కాలేదు'' అని కేఆర్కేను ఓ నెటిజన్ ప్రశ్నించారు. ''అదృష్టంతో 48 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారంటావా?'' అని మరో నెటిజన్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ''ప్రతిభ, కష్టపడే గుణం, మానవత్వం, ఇతరుల్ని గౌరవించడం వంటి అంశాలను మర్చిపోయినట్టు ఉన్నావు'' అని చాలా మంది కేఆర్కేకు గుర్తు చేశారు.
దక్షిణాదిలో రజనీని చాలా మంది దేవుడిగా పూజిస్తారని, నువ్వు ఆయన కాలి గోటితో సమానం కాదని అర్థం వచ్చేలా మరొకరు ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కమాల్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్ గురించి చాలా చర్చ జరిగింది. ఆయన కోరుకున్న పబ్లిసిటీ లభించింది.
Also Read : అనుష్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - అనుకున్నదే జరిగింది!
'జైలర్'పై అంచనాలు పెంచిన ట్రైలర్
కమాల్ ఆర్ ఖాన్ చేసే కామెంట్స్, ఇతర విమర్శలు పక్కన పెడితే... సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' కోసం అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో మూడు పాటలు విడుదల అయ్యాయి. అయితే... 'నువ్ కావాలయ్యా' సాంగ్ వైరల్ అవుతోంది. అందులో తమన్నా వేసిన స్టెప్పులకు చాలా మంది రీల్స్ చేస్తున్నారు.
Also Read : ఎంపీగా గెలుస్తా - రాజకీయాలపై 'దిల్' రాజు సంచలన వ్యాఖ్యలు
'జైలర్' (Jailer Movie)కు శివ కార్తికేయన్ హీరోగా 'వరుణ్ డాక్టర్', తమిళ స్టార్ హీరో విజయ్‌తో 'బీస్ట్' చిత్రాలు తీసిన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు. రజనీకి 169వ సినిమా. మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్ కుమార్, సునీల్, రమ్య కృష్ణ, వినాయకన్, మర్నా మీనన్, తమన్నా, వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్, కిషోర్, బిల్లీ మురళీ, సుగుంతన్, కరాటే కార్తీ, మిథున్, అర్షద్, మారిముత్తు , రిత్విక్, శరవణన్, అరంతంగి నిషా, మహానంది శంకర్ తదితరులు ఇతర తారాగణం. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : విజయ్ కార్తీక్ కన్నన్, కూర్పు : ఆర్. నిర్మల్, కళ : డాక్టర్ కిరణ్, యాక్షన్: స్టన్ శివ.