పోలవరానికి శని జగన్ - చంద్రబాబు ఆగ్రహం


ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ మోహన్ రెడ్డి అహంకారంతో నాశనం  చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలోని టీడీపీ ఆఫీసులో  పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వ తీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ప్రభుత్వం తీరు వల్ల ప్రాజెక్టు పడకేసిందన్నారు. పోలవరం పునరావాసానికి టీడీపీ హయాంలో రూ. 4114 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపారు. వైసీపీ హయాంలో నిర్వాసితుల కోసం కేవలం రూ. 1890 కోట్లే ఖర్చు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. పోలవరం నిర్వాసితులకు ఎకరానికి రూ. 19 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. పరిహారం ఇవ్వకపోగా లబ్దిదారుల జాబితా మార్చి అవకతవకలకు పాల్పడ్డారన్నారని మండిపడ్డారు. ఇంకా చదవండి


ఓఆర్ఆర్ టెండర్లపై రేవంత్ రెడ్డి అడిగిన వివరాలన్నీ ఇవ్వాల్సిందే


ఓఆర్​ఆర్ టెండర్ల సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని, ఆర్టీఐ పిటిషన్ ద్వారా అడిగినా ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ జరిగింది. ఆర్టీఐ ఉన్నది ఎందుకని విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలకు కూడా అడిగిన సమాచారం ఇవ్వకపోతే చట్టసభల్లో  ఏం మాట్లాడుతారని ప్రశ్నించింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అడిగిన సమాచారం  మొత్తం ఇస్తామని ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. రెండు వారాల్లోగా రేవంత్ రెడ్డి అడిగిన  సమాచారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఇంకా చదవండి


చేసిన అప్పులు, కట్టిన ఇళ్లపై శ్వేతపత్రం విడుదల చేయాలి - జగన్‌ సర్కార్‌కు పురందేశ్వరి డిమాండ్


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అప్పులకు..కట్టిన ఇళ్లకు శ్వేతపత్రం విడుదల చేయాలని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి డిమాండ్ చేశారు. ఏపీ బీజేపీ జోనల్ కమిటీ సమావేశాల్లో భాగంగా ఆమె విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు.  తమ జేబులు నింపుకోడానికి ఏపి పాలకులు పాకులాడుతున్నారని మండిపడ్డారు.  చేసిన అప్పులు, కట్టిన ఇళ్ళపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ ప్రభుత్వం అనధికారికంగా రూ. 4 లక్షల 74 వేల కోట్లు అప్పులు చేసిందని ఆ భారాన్ని ప్రజలపై రుద్దుతోందని ఆమె ఆరోపించారు. ఇంకా చదవండి


గ్రేటర్ ఆఫీసు ఎదుట ఉద్రిక్తత - కాంగ్రెస్ ఆకస్మిక ధర్నా !


హైదరాబాద్‌లో వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రభుత్వం  పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ  ప్రధాన కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  వర్షాలు  , వరదలు   ఎదుర్కోవడంలో ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా కాంగ్రెస్  ధర్నాకు పిలుపునిచ్చింది. -  జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించడంలేదు. గన్‌పార్కు  కాంగ్రెస్ శ్రేణులు  ర్యాలీ నిర్వహించారు. ఇంకా చదవండి


గోదావరి తీర ప్రాంత ప్రజలకు హై అలర్ట్- మూడు రోజుల్లో వరద మరింత పెరిగే అవకాశం


వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పుతిప్పలు పెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. గురువారం సాయంత్రం నుంచి మాత్రం కొన్ని ప్రాంతాల్లో వరుణుడు చిన్న బ్రేక్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇంకా వర్షాల బెడద పోలేదని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంకా చదవండి