Congress Protest :   హైదరాబాద్‌లో వరదలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రభుత్వం  పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ  ప్రధాన కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.  వర్షాలు  , వరదలు   ఎదుర్కోవడంలో ప్రభుత్వం వైఫల్యానికి నిరసనగా కాంగ్రెస్  ధర్నాకు పిలుపునిచ్చింది. -  జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కార్యాలయంలోకి ఎవరినీ అనుమతించడంలేదు. గన్‌పార్కు  కాంగ్రెస్ శ్రేణులు  ర్యాలీ నిర్వహించారు. 


ప్రజల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ధర్నా 


గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన కాంగ్రెస్ నేతలందరూ జీహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర ధర్నాకుదిగారు.  ఆఫీసు ముందు బైఠాయించి అధికారుల తీరుకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు  హైదరాబాద్‌ను విశ్వనగరంగా తయారు చేస్తామని మంత్రి కేటీఆర్   చెప్పారని, విశ్వనగరం కాదుకదా.. ఇప్పుడు చెత్తనగరంగా తయారు చేశారని వారంతా ప్లకార్డులు ప్రదర్శించారు.  నగరాన్ని కాపాడాల్సిన అవసరముందన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యానని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ఇబ్బందులు పడుతున్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ. 10వేల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. నాలాల పూడిక తీయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ నేత వీహెచ్  గ్రేట్ర కార్యాలయం  లిఫ్ట్ దగ్గరకు వెళ్లి ధర్నా చేశారు. వారందర్నీ పోలీసులుబలవంతంగా తరలించారు.  





 


వరదలతో గ్రేటర్‌లో  పలు ప్రాంతాల్లో నీట మునిగిన బస్తీలు


హైదరాబాద్ చుట్టూ  దాదాపుగా పది రోజుల పాటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.  దీంతో  బస్తీలు, పలు కాలనీలు..  నీటితో మునిగిపోయాయి. డ్రైనేజీ వ్యవస్థకు సైతం సమస్యలు ఏర్పడటంతో..  నీరు బయటకు వెళ్లే మార్గం కనిపించక.. వారం, పదిరోజుల నుంచి కొన్ని కాలనీలు నీళ్లలోనే ఉంటున్నాయి. అలాంటి చోట్ల మంచి నీటి సరఫరా కూడా ఇబ్బందికరంగా మారింది.  ఈ కారణాలతో ప్రభుత్వం.. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ అధికారులు సక్రమంగా పని చేయడం లేదని ధర్నాకు దిగారు. 


నష్టపరిహారం డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ 


గతంలో వరదలు వచ్చినప్పుడు ఇంటికి రూ. పది వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించారని.. ఇప్పుడు రూ. ఇరవై వేలు ప్రకటించాలని .. కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముంపునకు గురైన కాలనీల్లో నష్టపరిహారం అంచనా వేసి.. ప్రజల్ని ఆదుకోవాలంటున్నారు. ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి కనీసం నాలాలను కూడా మెరుగు పర్చకుండా.. ప్రజల్ని ముంచుతున్నారని వారు మండిపడుతున్నారు.. నాలాల్లో సిల్ట్ తీసే కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకపోవడం వల్ల.. ఎక్కువ శాతం నాలాల్లో బ్లాకేజీ ఉందని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించే వరకూ ఆందోళన చేస్తూనే ఉంటామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.