కిడ్నీ బాధితులకు మాటిచ్చా, పూర్తి చేశాను - సీఎం జగన్
తన పాదయాత్రలో ఉద్దానం ప్రజల బాధను చూశానని, అప్పుడు తాను ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు హామీలు నెరవేర్చానని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో (Palasa) గురువారం రూ.85 కోట్లతో నిర్మించిన డా.వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ (YSR Kidney Research Center), సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని (Super Speciality Hospital) ఆయన ప్రారంభించారు. ఇక్కడ 42 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 60 మంది స్టాఫ్ నర్సులు, 60 మంది సహాయక సిబ్బంది, 200 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇంకా చదవండి
వైజాగ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం
విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ధాటికి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఒక్కసారి అలుముకున్న పొగ, మంటలతో ఆసుపత్రిలో ఉన్న రోగులు భయాందోళనలకు గురయ్యారు. అవకాశం ఉన్న వాళ్లు బయటకు పరుగులు తీశారు. కదల్లేని వాళ్లు మాత్రం అక్కడే ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఉండిపోయారు. ఇంకా చదవండి
శుక్రవారం ఆస్పత్రి నుంచి ఇంటికి కేసీఆర్
బాత్‌రూంలో జారిపడి గాయం కావడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి నంది నగర్ ఇంటికి కేసీఆర్ వెళ్లనున్నారు. సుమారు 6 రోజులుగా యశోద ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో ఆస్పత్రి వర్గాలు ఇంటికి వెల్లడానికి పరిమిషన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కేసీఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం కేసీఆర్ ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చే్శారు. ఫామ్ హౌస్ కు వెళ్లారు. అయితే వైద్య సేవల కోసం ఫామ్ హౌస్ దూరంగా ఉండటంతో.. ఆయన సిటీలోని తన ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నందినగర్ లో ఇంటిని యుద్ధప్రాతిపదికన బాగు చేసినట్లుగా తెలుస్తోంది. ఇంకా చదవండి
బాధ్యతలు చేపట్టిన రోజే ఐటీ మినిస్టర్ వార్నింగ్
ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మినిస్టర్‌గా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ఈ ఉదయం 9 గంటల సమయంలో తన ఛాంబర్‌లో శాస్త్రోక్తంగా తన సీట్లు కూర్చున్నారు. అనంతరం బాధ్యతలు తీసుకున్న ఫైల్‌పై సంతకాలు చేశారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులతో సమావేశమయ్యారు. తొలి సమావేశంలోనే అధికారులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు శ్రీధర్‌బాబు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసేలా లీకులు ఇస్తే మాత్రం సహించేది లేదని చెప్పేశారు. ఈ మధ్యకాలంలో ఓ కంపెనీ తెలంగాణ నుంచి వెళ్లిపోతోందని ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. దీన్ని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలైపోయింది. ఇంకా చదవండి
ఈ సంప్రదాయం కొనసాగిద్దాం- అసెంబ్లీలో సీఎంగా రేవంత్‌రెడ్డి తొలి స్పీచ్
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో తొలి ప్రసంగం చేశారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ ను అభినందిస్తూ మాట్లాడారు. తొలి స్పీచ్‌లో ఆయన ఏమన్నారంటే..." మూడో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ను ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకారం అందించిన బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ కాంగ్రెస్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకొచ్చాం. ఇదే సంప్రదాయం భవిష్యత్‌లో కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరి సహకారం అందరి సమన్వయంతో సమావేశాలు నిర్వహించుకుంటే తెలంగాణ ఆకాంక్షను సభ ద్వారా పరిష్కరించవచ్చు. ఇంకా చదవండి