నేడు విశాఖలో అమిత్ షా సభ


ఈ నెల 11 వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ పర్యటనకు రానున్నారు. నగరంలో అమిత్ షా బహిరంగ సభ సందర్బంగా నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో బందోబస్తుకు సంబంధించి అధికారులతో విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.సి.యం.త్రివిక్రమ వర్మ సమావేశం నిర్వహించారు. మొత్తం నలుగురు డిసిపీ లు, రెండు ఏ.పి.ఎస్.పి ప్లటూన్లు, 04 స్పెషల్ పార్టీ లతో మొత్తంగా 950 సిబ్బంది, అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బందో బస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంకా చదవండి


పవన్ వారాహి యాత్రకు వైసీపీ సర్కార్ బ్రేకులు!


అమలాపురం అల్లర్ల కారణంగా దాదాపు ఆరు నెలల పాటు అమలుల్లో ఉన్న సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ దశలు దశలుగా ఎత్తివేశారు. అయితే అమలాపురం డీఎస్పీ అంబికా ప్రసాద్‌, కొత్త‌పేట డీఎస్పీ కేవీ ర‌మ‌ణ  పేరుతో అమలాపురం, కొత్తపేట పోలీస్ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఈ రోజు  (జూన్‌ 10) అర్ధరాత్రి నుంచి  సెక్షన్‌ 30 అమల్లో ఉంటుందని పోలీసులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ ఆంక్షలు ఈనెల 30 వరకు అమల్లో ఉంటుందని ఆ ప్రకటలో తెలిపారు. ఈ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా సభలు సమావేశాలు ఊరేగింపులు వంటివి జరగడానికి వీల్లేదు. ఇంకా చదవండి


భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్


భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి వెబ్ సైట్ అని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్బీజేపీ నేతల మధ్య ధరణి వెబ్ సైట్ పై ఆరోపణలు, సవాళ్ల పర్వం కొసాగుతోంది. ఈ క్రమంలో ధరణి వెబ్ సైట్ గురించి సీఎం కేసీఆర్ చెప్పిన మాటల్ని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ-గవర్నెన్స్‌లో దేశంలోనే తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో జీహెచ్ఎంసీ వార్డు అధికారులకు నిర్వహించిన ఓరియంటేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంకా చదవండి


నేడే 'గ్రూప్‌-1' ప్రిలిమినరీ పరీక్ష


తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 11న నిర్వహించే ప్రిలిమినరీ రాతపరీక్షకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. అయితే పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందునుంచే పరీక్ష కేంద్రాల వద్ద గేట్లు మూసివేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇంకా చదవండి


తెలంగాణ ఐఏఎస్‌పై గృహహింస, అసహజ శృంగార ఆరోపణలు


ఛత్తీస్ గఢ్ జిల్లాలోని కోర్బా జిల్లా సెషన్స్ కోర్టు 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. సందీప్ కుమార్ ఝా తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయన సొంత స్థలం బిహార్‌లోని దర్భంగా జిల్లా. ఈ అధికారిపై తాజాగా ఆయన భార్య గృహహింస, వరకట్న వేధింపులు, అసహజ శృంగారం చేయమని బలవంతం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయంలో ఛత్తీస్ గఢ్‌లోని కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇంకా చదవండి


జగన్‌ పాలనపై జేపీ నడ్డా ఘాటు విమర్శలు - వైఎస్ఆర్‌సీపీ నేతలు కౌంటర్ ఇవ్వగలరా?


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ నేతల దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా వారిపై విరుచుకుపడతారు. ఎవరైనా వచ్చి ప్రతిపక్షాన్ని పొగిడినా ఊరుకోరని ఇటీవల రజనీకాంత్ ఉదంతంతో తేలిపోయింది. ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీకి వచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు.  అలాంటి విమర్శలు ఇతరులు చేస్తే.. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇప్పటికే తమకు మాత్రమే సాధ్యమైన భాషలో హోరెత్తించి ఉండేవాళ్లు.  కానీ ఇప్పుడు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. జేపీ నడ్డా విమర్శలకు పెద్దగా కౌంటర్ ఇవ్వడం  లేదు. ఇంకా చదవండి


విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు


నేడు విశాఖపట్నం ఒక అరుదైన రికార్డుని నమోదు చేసింది. వైజాగ్ లో ఈ శతాబ్ధంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. నగరంలోని ముఖ్యంగా ఏర్పోర్టులో 44.6 డిగ్రీల అత్యథిక ఉష్ణోగ్రత నేడు మధ్యాహ్నం నమోదయ్యింది. విజయవాడ అయినా 43 డిగ్రీలు ఉంది, కానీ సముద్ర తీర ప్రాంతం పక్కనే ఉంటూ అంత ఉష్ణోగ్రత అంటే అది దాదాపుగా 55 డిగ్రీలు లాగా ఉంటుంది. రుతుపవనాలు ఆలస్యం అయితే జరిగేది ఇది. దీనికి తోడు పసిఫిక్ లో ఎల్-నినో ప్రభావం వలన వేడి అత్యధికంగా ఉంది అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఇంకా చదవండి


నయనతారకు విఘ్నేష్ సర్ ప్రైజ్


సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. చాలా కాలంగా లవ్ ట్రాక్ నడిపిన వీరిద్దరు..  2023, జూన్ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చెన్నైకి సమీపంలోని మహాబలిపురంలో వీరి వివాహ వేడుక జరిగింది. రజనీకాంత్, షారుఖ్ ఖాన్, అజిత్ కుమార్, విజయ్ సేతుపతి, ఏఆర్ రెహమాన్, సూర్య, మణిరత్నం, జ్యోతిక సహా పలువురు టాప్ స్టార్స్ ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇంకా చదవండి


పన్ను ఆదా చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి, త్వరగా సేకరించండి


2022-23 ఆర్థిక సంవత్సరానికి (AY 2023-24) ఆదాయ వివరాలతో IT రిటర్న్‌ ఫైల్‌ చేసే సీజన్‌ స్టార్టయింది, జులై 31 వరకు గడువు ఉంది. ఆదాయ పన్ను డిక్లరేషన్‌ సమయంలో పన్ను ఆదా చేయాలంటే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆడిటర్‌కు చూపడం తప్పనిసరి. మీరు ఏదైనా మార్గంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆయా పెట్టుబడులకు సంబంధించిన ధృవపత్రాలు ఇప్పటికీ మీ దగ్గర లేకపోతే, వాటిని సేకరించే పనిని వెంటనే ప్రారంభించండి. మీపై పన్ను బాధ్యత ఉంటుందా, లేదా?; ఒకవేళ పన్ను చెల్లించాల్సి వస్తే ఎంత పన్ను కట్టాల్సి ఉంటుంది అన్నది మీరు సేకరించే డాక్యుమెంట్ల ఆధారంగానే నిర్ణయమవుతుంది. ఇంకా చదవండి


ఆశలన్నీ ఆదివారం పైనే - ఈ ఒక్క రోజు ఆడితే కప్పు మనదే!


ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో 444 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. చివరి రోజు భారత్ విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది. ఆస్ట్రేలియా గెలవాలంటే ఏడు వికెట్లు తీయాలి. కాబట్టి ఈ మ్యాచ్‌లో అన్ని రకాల ఫలితాలు వచ్చే అవకాశం ఉందన్న మాట. క్రీజులో విరాట్ కోహ్లీ (44 బ్యాటింగ్: 60 బంతుల్లో, ఏడు ఫోర్లు), అజింక్య రహానే (20 బ్యాటింగ్: 59 బంతుల్లో, మూడు ఫోర్లు) ఉన్నారు. ఇంకా చదవండి