ఈ నెల 11 వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా విశాఖ పర్యటనకు రానున్నారు. నగరంలో అమిత్ షా బహిరంగ సభ సందర్బంగా నగర పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో బందోబస్తుకు సంబంధించి అధికారులతో విశాఖ నగర పోలీసు కమిషనర్ డా.సి.యం.త్రివిక్రమ వర్మ సమావేశం నిర్వహించారు. మొత్తం నలుగురు డిసిపీ లు, రెండు ఏ.పి.ఎస్.పి ప్లటూన్లు, 04 స్పెషల్ పార్టీ లతో మొత్తంగా 950 సిబ్బంది, అధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బందో బస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించే ప్రాంతాలైన ఐ.ఎన్.ఎస్ డేగ, ఎయిర్ పోర్ట్, వాల్తేరు రైల్వే గ్రౌండ్స్ బస చేయనున్న పోర్టు గెస్ట్ హౌస్, సాగర్ మాల కన్విక్షన్ సెంటర్ తో పాటూ ఆయన పర్యటించనున్న ప్రతీ ప్రాంతంలో పటిష్ట బందొబస్తూ నిర్వహించాలని అధికారులను విశాఖ సీపీ ఆదేశించారు. వాస్తవానికి అమిత్ షా ఈనెల 8న విశాఖకు రావాల్సి ఉంది. కానీ వేరే కార్యక్రమాలు ఉన్నందున విశాఖ పర్యటనను ఈ ఆదివారానికి వాయిదా వేసుకున్నారు. కాగా, నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరుసటి రోజే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటనతో ఏపీపై బీజేపీ పట్టుకోసం ఫోకస్ చేస్తోంది.                                    

  


అమిత్ షా విశాఖ పర్యటన, రైల్వే న్యూ కాలనీ జంక్షన్ వద్ద వున్న రైల్ వే ఫుట్ బాల్ గ్రౌండ్స్ లో సాయంత్రం బహిరంగ సభ ఏర్పాటు ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. అమిత్ షా సభకు ప్రజలు హాజరు అవుతున్నందున, ప్రముఖుల పర్యటన సందర్బముగా  ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడటంలో భాగంగా జూన్ 11న మధ్యాహ్నం 3 గంటలనుండి రాత్రి 09 గంటల వరకు ఈ క్రింది తెలిపిన మార్గముల ద్వారా వాహనములు ప్రయాణించుటకు అనుమతి లేదని స్పష్టం చేశారు. వాహనదారులు ఈ సమయంలో ప్రత్యామ్న్యాయ మర్గాములలో ప్రయాణించి  ట్రాఫిక్ పోలీస్ వారికి సహకరించాలని నగర ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.     


1. అమిత్ షా బహిరంగ సభకు వచ్చే బస్సులు TC పాలెం/28 బస్ స్టాప్ వద్ద, సదరు బస్సులు ఆశీర్వాద కళ్యాణ మండపము వైపు వున్న రోడ్ మార్జిన్ లో మరియు DLB గ్రౌండ్స్ లో, విశాఖ  పోర్ట్ హాస్పిటల్ వద్ద వున్న Inarbit మాల్ గ్రౌండ్స్ లో తమ తమ వాహనములలోని ప్రజలని దించి అక్కడే పార్కింగ్ చేసుకోవాలి.
2. అమిత్ షా బహిరంగ సభకు వచ్చే ఆటోలు,ద్విచక్ర వాహనములు కేంద్రీయ విద్యాలయం వరకు గల 80 ఫీట్ రోడ్ మార్జిన్ లో  TC పాలెం/28 బస్ స్టాప్ గుండా  వెళ్లి పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.
3. కంచరపాలెం మెట్టు నుండి అక్కయ్యపాలెం 80 feet రోడ్ లో వున్న  మహారాణి పార్లర్ వరకు మరియు TC పాలెం నుండి DLO జంక్షన్ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి లేదు. కనుక ప్రత్యామ్నాయ మర్గాలలో ప్రయాణించాలని కోరారు.


పలు ప్రాంతాల నుండి బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, కేంద్ర హోం మంత్రి నగర పర్యటన సజావుగా సాగేలా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు విశాఖపట్నం సీపీ తెలిపారు. కావున వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షల వివరాలు తెలుసుకుని పోలీసు వారికి సహకరిస్తూ ప్రత్యామ్నాయ మర్గాలలో ప్రయాణించాలని సూచించారు.