టీడీపీలోకి నెల్లూరు రెడ్లు


2014 ఎన్నికల్లో  నెల్లూరు జిల్లాలో ఉన్న పది స్థానాలను టీడీపీ కోల్పోయింది. వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. అయితే.. ఇప్పుడు వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంకా చదవండి


 


బీజేపీపై ఫైర్


మందికి పుట్టిన బిడ్డను తమదే అంటూ బీజేపీ లీడర్లు తిరుగుతున్నారని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. కూకట్‌పల్లి హౌసింగ్‌ బౌర్డు కాలనీలో వంద పడకల ఆసుపత్రి శంకుస్థాపనలో మాట్లాడిన హరీష్‌. 2014 తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించారు. ఒకప్పుడు నీటి కోసం హైదరాబాద్‌లో ధర్నాలు, రాస్తారోకోలు జరిగేవని ఇప్పుడు అలాంటి సమస్యే లేదన్నారు. మహారాష్ట్రలో నేటికీ వారం పదిరోజులకోసారి నీళ్లు వచ్చే ప్రాంతాలు ఉన్నాయన్నారు. ఇంకా చదవండి


 


ఆమె గర్భంతో సంబంధం లేదంటున్న సాయికృష్ణ


అత్యంత దారుణంగా ప్రేమించిన అప్సరను చంపేసిన సరూర్‌నగర్ పూజారి సాయికృష్ణ పోలీసులను కూడా భయపెట్టాడు. అరెస్టు చేసిన తర్వాత శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో హంగామా చేశాడని తెలుస్తోంది. ఆవేశంలో ఈ పని చేశానని చెప్పుకుంటూ బోరున విలపించినట్టు కూడా కథనాలు వినిపిస్తున్నాయి. అప్సర మిస్ అయిన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా సాయికృష్ణను పిలిచి విచారించారు. సీసీటీవీ ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడే హంతకుడిగా నిర్దారించుకున్నారు. ఈ క్రమంలోనే పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి శంషాబాద్ పోలీసులు ఆధారాలు ముందు ఉంచి ప్రశ్నించారు. ఎవిడెన్స్‌తో దొరికిపోయిన తర్వాత చేసేది లేక నేరాన్ని అంగీకరించాడు. ఇంకా చదవండి


 


అహం వల్ల ఓడిపోయాం


గత ఎన్నికల్లో తాము ఎందుకు ఓడిపోయామో..  మాజ మంత్రి దేవినేని ఉమ ఓ సమావేశంలో చేసిన వ్యాక్యలు కలకలం రేపుతున్నాయి.   నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో తాను, సౌమ్య, ధీమా, అహంకారం తో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయామని ఆయన విశ్లేషించుకున్నారు.  పసుపు, కుంకుమ ఇచ్చాం కదా అని వీర తిలకాలు దిద్ది ఊరేగిస్తూన్నారని ఊరేగాం కానీ వైసిపి ఎమ్మెల్యేలు కాళ్ళు గడ్డాలు పట్టుకొని గెలిచారని విమర్శించారు.   మైలవరం లో తండ్రి కొడుకులు, నందిగామ లో వసూలు బ్రదర్స్ కొండలు గుట్టలు దోచుకున్నారన్నారు.  ఇసుక విషయం నందిగామ, మైలవరం , జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యే లు నెలకు 7 కోట్లు పంపిస్తున్నారని ఆరోపించారు. ఇంకా చదవండి


 


 


చంద్రబాబుపై ఫైర్


మంత్రులంతా తనను, టీడీపీని తిట్టడానికి తప్ప వేరే పని చేయడం లేదన్న చంద్రబాబు కామెంట్స్‌పై సీరియస్ అయ్యారు మంత్రిజోగి రమేష్. ఆరిపోయిన పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడని ఆయన్ని తిట్టాల్సిన అవసరం టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేన్నారు. ఆయన జీవితం గురించి ఐటీడీపీకి తెలియదా అని ప్రశ్నించారు. అమరావతిలోని వైసీపీ పార్టీకార్యాలయంలో మాట్లాడిన జోగి రమేష్‌ తీవ్ర పదజాలంతో విరుచుకు పడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు జోగి రమేష్. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా హామీలు ఇచ్చారని వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. సంవత్సరానికి 12 సిలిండర్లు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదని ప్రస్నించారు. డ్వాక్రా రుమాఫీ ఏమైందని నిలదీశారు. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా మోసం చేశారన్నారు. మంచి నీళ్లు ఇవ్వలేదు కానీ ఇంటింటికీ మద్యం సరఫరా చేశారని ఆరోపించారు. ఇంకా చదవండి