Devineni Uma : గత ఎన్నికల్లో తాము ఎందుకు ఓడిపోయామో..  మాజ మంత్రి దేవినేని ఉమ ఓ సమావేశంలో చేసిన వ్యాక్యలు కలకలం రేపుతున్నాయి.   నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో తాను, సౌమ్య, ధీమా, అహంకారం తో గెలుస్తామనే బలుపుతో ఓడిపోయామని ఆయన విశ్లేషించుకున్నారు.  పసుపు, కుంకుమ ఇచ్చాం కదా అని వీర తిలకాలు దిద్ది ఊరేగిస్తూన్నారని ఊరేగాం కానీ వైసిపి ఎమ్మెల్యేలు కాళ్ళు గడ్డాలు పట్టుకొని గెలిచారని విమర్శించారు.   మైలవరం లో తండ్రి కొడుకులు, నందిగామ లో వసూలు బ్రదర్స్ కొండలు గుట్టలు దోచుకున్నారన్నారు.  ఇసుక విషయం నందిగామ, మైలవరం , జగ్గయ్యపేట నుంచి ఎమ్మెల్యే లు నెలకు 7 కోట్లు పంపిస్తున్నారని ఆరోపించారు. 


మొన్నటి వరకు మైలవరం ఎమ్మెల్యే ఇసుక కోసం నెలకు 7కోట్లు పంపాడని..  ఇప్పుడు నందిగామ వంతు రావడం తో 7కోట్ల ఇసుక సొమ్ము తాడేపల్లి కి పంపుతున్నారని ఆరోపించారు.  నందిగామ లో నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం లో మాజీ ఎమ్మెల్యే సౌమ్య తో కలిసి పాల్గొన్న ఉమ  ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలోనే మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కూడా ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.  కొన్ని గ్రామాల నాయకులు తన కార్యాలయానికి రావడానికి సంకోచిస్తున్నారని.. వారంతా  ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.   మండల స్థాయి నాయకులను ఏ విధంగా గౌరవిస్తునారో ఇన్చార్జి ని కూడా గౌరవించాలని సూచించారు.  గ్రామాల్లో ఏదైనా సమస్యలు ఉంటే ఇన్చార్జి అయిన తనకు డైరెక్ట్ గా చెప్పుకోవచ్చన్నారు. గ్రామస్థాయి నాయకులు భయాన్ని వీడి ఇన్చార్జి కి సమస్యలు చెప్పుకోవచ్చన్నారు.  నందిగామ లో 30 సంవత్సరాలు అధికారం తమదే అన్న వసూలు బ్రదర్స్ పని 3 నెలలకే  అయిపోయింన్నారు.  ఎప్పుడు చూడని రాజకీయాలు నందిగామ నియోజకవర్గం లో చూస్తున్నామని వైసిపి ఓటు వేసిన నాయకులే చెప్తున్నారన్నారు.  


మైలవరం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న  దేవినేని ఉమ గత ఎన్నికల్లో వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఓడిపోయారు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఆయనను ఓడించాలన్న పట్టుదలతో.. టీడీపీకి దగ్గరగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ను పార్టీలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇచ్చారు. వాస్తవానికి మైలవరం నుంచి ..  జోగి రమేష్ గతంలో పోటీ చేసి దేవినేని ఉమ చేతిలో ఓడిపోయారు. ఆయనే ఇక్కడ ఇంచార్జ్ గా ఉన్నారు. జోగి రమేష్ ను పెడన నియోజకవర్గానికి పంపించి.. వసంత కృష్ణప్రసాద్ కు .. మైలవరం టిక్కెట్ కేటాయించారు. ఆర్థికంగా ఎంతో బలవంతుడైన వసంత కృష్ణప్రసాద్  ..  వైసీపీ గాలిలో విజయం సాధించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తామన్న నమ్మకంతో ఉన్న దేవినేని ఉమకు.. షాక్ తగిలినట్లియంది. 


సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తండ్రి మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చిన తంగిరాల సౌమ్య మొదట విజయం సాదించారు. అందరి సమస్యలు పరిష్కరించే నేతగా పేరు తెచ్చుకున్న వైసీపీ గాలిలో ఓడిపోయారు.   గెలుస్తామన్న ధీమా .. అహంకారం కారణంగానే ఓటమి  పాలయ్యామని ఇప్పుడు దేవినేని ఉమ రియలైజ్ అవుతున్నారు.