సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది?


 ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం పేరుతో భారీగా ఇప్పుడే ఖర్చుపెట్టుకోవద్దని పార్టీ నేతలు ఇంతకు ముందు బీఆర్ఎస్ హైకమాండ్ సందేశం పంపింది. కానీ ఇప్పుడు ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని క్లారిటీ వచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా స్పష్టత వచ్చింది. వచ్చే నెల పదో తేదీ లోపు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల అధికారి వికాస్ రాజ్ చెబుతున్నారు. అయితే బీఆర్ఎస్‌లో మాత్రం గతంలో కనిపించినంత ఉత్సాహం కనిపించడం లేదు. ఇంకా చదవండి


చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దు, సీఐడీ 186 పేజీల కౌంటర్ 


టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో స్కిల్ డెవలప్‌మెంట్ కేసు వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. గత కొద్దిరోజులుగా ఈ కేసు చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడం, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడంతో గత కొద్దిరోజులుగా అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. చివరికి అసెంబ్లీ సమావేశాల్లో ఇరు పార్టీల సభ్యులు మీసం మెలేయడం, తొడలు కొట్టడం, విజిల్స్ వేయడం వరకు వెళ్లడంతో టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇంకా చదవండి


పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహిస్తే చర్యలు - వారికి విజయవాడ సీపీ వార్నింగ్ 


టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఆదివారం కార్ల ర్యాలీ నిర్వహించడానికి తలపెట్టారు. ఈ సందర్భంగా విజయవాడ సీపీ కాంతిరాణ టాటా స్పందించారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు ఆదివారం నిర్వహించున్న కార్ల ర్యాలీకి అనుమతి లేదని తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా కమిషనరేట్‌ పరిధిలో ర్యాలీలు, ప్రదర్శనలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు ఐటీ ఉద్యోగులు కార్ల ర్యాలీ నిర్వహించనున్నట్టు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు. ఇంకా చదవండి


రైతులు ఆత్మహత్యలు చేసుకొని చావాలి - నోరుజారిన ఎమ్మెల్యే


నిత్యం వివాదాలతో సహవాసం చేస్తున్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. మరోసారి నోరు జారి చిక్కుల్లో పడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుని చావాలి అంటూ దారుణమైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని, రైతులకు క్షమాపణ చెప్పాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంకా చదవండి


కోవింద్ అధ్యక్షతన తొలి భేటీ- పార్టీలు, లా కమిషన్ సూచనలు ఆహ్వానించనున్న ప్యానెల్


జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను అన్వేషించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీ శనివారం తొలిసారి సమావేశమైంది. సమావేశాన్ని ఉపోద్ఘాతంగా పేర్కొంటూ, కమిటీకి ఇచ్చిన ఆదేశంపై ఎలా వెళ్లాలనే దానిపై రోడ్ మ్యాప్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఒకే దేశం - ఒకే ఎన్నికలపై లా కమిషన్, జాతీయ రాష్ట్ర పార్టీల సూచనలు కూడా ఆహ్వానించాలని ప్యానెల్ నిర్ణయించినట్లు సమాచారం. ఇంకా చదవండి


అవయవ దానం చేస్తే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు, స్టాలిన్ సంచలన నిర్ణయం


అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని పెద్దలు అంటారు. ప్రస్తుత సమాజంలో అన్ని దానాల్లో కెల్లా అవయవదానం గొప్పదని వైద్యులు చెబుతున్నారు. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారి అవయవాలను, వైద్యుల సూచనతో కుటుంబసభ్యులు దానం చేస్తుంటారు. అవయవాల దానం ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అవయవాలు దానం చేసే వారికి గుర్తింపు లభించే విధంగా...ఆర్గాన్స్  దానం చేసే వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంకా చదవండి


సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా?


దాదాపు ప్రతి కారు యజమాని, అది బడ్జెట్ కారు అయినా లేదా లగ్జరీ కారు అయినా రీసేల్ వాల్యూ ముఖ్యమైనది. ఇది కారు వయస్సు, అది నడిచిన దూరంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా రీసేల్ వాల్యూపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే మరొక విషయం ఉంది. అది దాన్ని సరిగ్గా మెయింటెయిన్ చేయడం. కాబట్టి మీకు కారు ఉంటే అది విక్రయించినప్పుడల్లా మంచి ధర పొందాలని మీరు కోరుకుంటారు. కొన్ని టిప్స్ ఫాలో అయితే మీ వాహనానికి మంచి రీసేల్ వాల్యూ లభిస్తుంది. ఇంకా చదవండి


నువ్వేమైనా పెద్ద పిస్తావా? సందీప్‌కు నాగ్ క్లాస్, ఊహించని పనిష్మెంట్


సీజన్ 7 (Bigg Boss Telugu Season 7) శనివారం ఎపిసోడ్‌లో ఫస్ట్  హౌస్‌మేట్ సందీప్‌కు హోస్ట్ నాగార్జున ఫుల్ క్లాస్ పీకారు. నువ్వేమైనా పిస్తావా? అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంచాలకుడిగా విఫలమయ్యావని అన్నారు. ప్రియాంక, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్‌లో వీకెస్ట్ కంటెస్టెంట్‌ను పక్కన పెట్టాలని ‘బిగ్ బాస్’ చెబితే స్ట్రాంగెస్ట్ కంటెస్టెన్‌ను అనర్హుడిగా ప్రకటించడం, ప్రియాంకకు సలహాలు ఇవ్వడంపై నిలదీశారు. అయితే, స్పైసీ చికెన్ టాస్క్‌లో మాత్రం సందీప్ నిర్ణయాన్ని సమర్దించారు. అంతేకాదు, అమర్‌దీప్, ప్రియాంక‌లకు కూడా నాగ్ గట్టిగానే క్లాస్ పీకారు. ఇంకా చదవండి


రవితేజ 'సగిలేటి కథ' సెన్సార్ పూర్తి - విడుదల ఎప్పుడంటే?


యూట్యూబర్ రవితేజ మహాదాస్యం (Ravi Teja Mahadasyam) హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా 'సగిలేటి కథ' (Sagileti Katha Movie). విషిక కోట హీరోయిన్. రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించడంతో పాటు రచన, కూర్పు, కెమెరా వర్క్ బాధ్యతలు నిర్వర్తించారు. హీరో నవదీప్ సి స్పేస్ సమర్పణలో అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు తెరకెక్కించాయి. అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ నిర్మాతలు. ఇంకా చదవండి


భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా - ముఖాముఖి పోరులో పైచేయి ఎవరిది?


భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో భారత జట్టు 1-0తో ముందంజలో ఉంది. ఇంకా చదవండి