IND vs AUS Head To Head: భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో భారత జట్టు 1-0తో ముందంజలో ఉంది.
ఇండోర్ వన్డేలో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమ్ ఇండియా ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇండోర్‌లో భారత జట్టు కంగారూలను ఓడించగలదా? అదే సమయంలో ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఆస్ట్రేలియా జట్టు బరిలోకి దిగనుంది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 147 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఆస్ట్రేలియా 82 మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించింది. కాగా భారత జట్టు 55 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. 10 మ్యాచ్‌ల్లో ఫలితం లేకుండా ముగిశాయి.
భారత గడ్డపై గణాంకాలను పరిశీలిస్తే ఇక్కడ కూడా కంగారూలదే పైచేయి. భారత గడ్డపై భారత్, ఆస్ట్రేలియా మధ్య 68 మ్యాచ్‌లు జరిగాయి. భారత జట్టు ఆస్ట్రేలియాను 31 సార్లు ఓడించింది. 32 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా... భారత్‌కు 277 పరుగుల విజయ లక్ష్యం నిర్దేశించింది. దీంతో భారత జట్టు 48.4 ఓవర్లలో 5 వికెట్లకు 281 పరుగులు చేసి విజయం సాధించింది. భారత్ తరఫున శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ అర్ధ సెంచరీలు ఆడారు.
అంతకుముందు టాస్ గెలిచిన భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ తరఫున ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial