India vs Australia 2nd ODI: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరగనుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు ఐదు వికెట్ల తేడాతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని ఆస్ట్రేలియా, ఎలాగైనా గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుని భారత్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.


మొహాలీ వన్డేలో భారత జట్టు కంగారూలను ఐదు వికెట్ల తేడాతో ఓడించినప్పటికీ, ఆస్ట్రేలియాలో కొందరు ఆటగాళ్లు సింగిల్ హ్యాండ్‌తో జట్టును గెలిపించే సామర్థ్యం కలిగి ఉన్నారు. ఇండోర్‌లో ఆస్ట్రేలియా జట్టును ఒంటరిగా నడిపించగల ముగ్గురు ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.


1. మిచెల్ మార్ష్
విధ్వంసకర బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందిన మిచెల్ మార్ష్, మొహాలీ వన్డేలో కేవలం ఒక ఫోర్ మాత్రమే కొట్టి ఔటయ్యాడు. అయితే అతను మ్యాచ్ గమనాన్ని మార్చగలడని అందరికీ తెలిసిందే. మార్ష్ ప్రస్తుతం ఓపెనింగ్ చేసి మొదటి బంతి నుంచే బౌండరీలు కొట్టడం ప్రారంభించాడు. మార్ష్ తొలి 10 ఓవర్లు ఆడితే మ్యాచ్ భవితవ్యాన్ని మార్చేయగలడు.


2. డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మొహాలీలో జరిగిన వన్డేలోనూ వార్నర్ హాఫ్ సెంచరీ సాధించాడు. వార్నర్ అనుభవం, ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఇండోర్‌లో ఆస్ట్రేలియా జట్టును ఒంటిచేత్తో గెలిపించగలడని చెప్పడంలో తప్పులేదు.


3. మార్కస్ స్టోయినిస్
మార్కస్ స్టోయినిస్ లోయర్ ఆర్డర్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌తో అద్భుతాలు చేయగలడు. మొహాలీలో జరిగిన తొలి వన్డేలో స్టోయినిస్ వేగంగా 29 పరుగులు సాధించాడు. చివరి వరకు నిలదొక్కుకుని ఉంటే స్కోరును సులువుగా 300 పరుగులకు చేర్చేవాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ ద్వారా కూడా జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా నిలవగలడు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial