యూట్యూబర్ రవితేజ మహాదాస్యం (Ravi Teja Mahadasyam) హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న సినిమా 'సగిలేటి కథ' (Sagileti Katha Movie). విషిక కోట హీరోయిన్. రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించడంతో పాటు రచన, కూర్పు, కెమెరా వర్క్ బాధ్యతలు నిర్వర్తించారు. హీరో నవదీప్ సి స్పేస్ సమర్పణలో అశోక్ ఆర్ట్స్, షేడ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు తెరకెక్కించాయి. అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ నిర్మాతలు. 


సెన్సార్ పూర్తి... రిలీజ్ ఎప్పుడంటే?
Sagileti Katha Release Date : 'సగిలేటి కథ' విడుదల తేదీని ఈ రోజు అనౌన్స్ చేశారు. అక్టోబర్ 6న థియేటర్లలోకి సినిమాను తీసుకు వస్తున్నామని తెలిపారు. అంతే కాదు... సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని చెప్పారు. సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యు/ఏ సర్టిఫికెట్ వచ్చింది. పెద్దలతో పాటు పిల్లలు సినిమాకు వెళ్ళవచ్చు అన్నమాట!






గ్రామీణ నేపథ్యంలో పాటలకు సూపర్ రెస్పాన్స్!
'సగిలేటి కథ' చిత్రానికి జశ్వంత్ పసుపులేటి సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ సినిమాలో రెండు పాటలు విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేశారు.    


Also Read విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ పోతినేని - హీరో ఏమన్నారో తెలుసా?


''అట్టా ఎట్టాగా పుట్టేసినావు
నన్నే ఇట్టాగా సంపేస్తున్నావు
సలికాలం సెగరేపే సలిమంటల్లాగా
నాలోన మంటేట్టినావే
ఇసుకల్లో నడిచొచ్చే ఓంటే పిల్లలాగా
నీదారే నాదంటూ దాహం తీర్చావే''
అంటూ సాగిన యశ్వంత్ నాగ్ ('పరేషాన్' మూవీ ఫేమ్), కమల మనోహరి పాడిన పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. తొలి పాటను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలో ఈ పాటలు ప్రేక్షకుల్ని ఆలరిస్తున్నాయని రవితేజ తెలిపారు. 


Also Read 'కన్నప్ప'లో ప్రభాసే కాదు, నయనతార కూడా - ఆమె క్యారెక్టర్ ఏమిటంటే?



'కనబడుటలేదు' తర్వాత షేడ్ స్టూడియోస్ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. ఆ సినిమాలో ఎలా అయితే కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చారో... ఈ సినిమాలోనూ అదే విధంగా కొత్త తారలకు అవకాశం ఇచ్చారు. గ్రామీణ నేపథ్యంలో వచ్చే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని షేడ్ స్టూడియోస్ సంస్థ తెలిపింది.


'సగిలేటి కథ' సినిమాలో రవితేజ మహాదాస్యం, విషిక కోట జంటగా నటించిన ఈ చిత్రానికి రచన, కూర్పు, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలు రాజశేఖర్ సుద్ మూన్ చూసుకున్నారు. అశోక్ మిట్టపల్లి, దేవి ప్రసాద్ బలివాడ నిర్మించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : నరేష్ బాబు మాదినేని, స్వరాలు : జశ్వంత్ పసుపులేటి, నేపథ్య సంగీతం సనల్ వాసుదేవ్, సాహిత్యం : వరికుప్పల యాదగిరి, రాజశేఖర్ సుద్మూన్, శశికాంత్ బిల్లపాటి, పవన్ కుందని.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial