Telugu News Today: సీఎం జగన్ పై రాయి దాడి ఘటన - రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సీఎం జగన్ (Cm Jagan)పై రాయి దాడి ఘటనకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించారు. ఈ కేసులో ఏ1 గా ఉన్న నిందితుడు సతీష్ ను గురువారం విజయవాడ సెషన్స్ కోర్టులో హాజరు పరచగా.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో సతీష్ ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సీసీ ఫుటేజీ, వీడియోల ఆధారంగా సతీష్ ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అతని ఫోన్ కూడా సీజ్ చేశామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


చంద్రబాబు తరఫున నారా భువనేశ్వరి నామినేషన్ - కుప్పంలో టీడీపీ శ్రేణుల సందడి
రాష్ట్రంలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. తొలి రోజు పలువురు కీలక నేతలు ఆర్వో కార్యాలయాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో (Kuppam) రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. అంతకు ముందు భారీ ర్యాలీగా భువనేశ్వరి ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా  కుమార్తె, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి భావోద్వేగంతో స్పందించారు.  జన్మనిచ్చి..   జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు అండగా, చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపం నువ్వు అమ్మ  నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనఃశాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


కారు షెడ్డు నుంచి రాదు - ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మసే - కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ 
బీఆర్ఎస్ కారు  కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.  మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకో.. మాడి మసైపోతావు. పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టాం. పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. తాను త్వరలో కాంగ్రెస్ లో చేరనున్నట్లు సీఎంకు ఆయన చెప్పినట్లు సమాచారం. మరో 2 రోజుల్లో అనుచరులతో కలిసి తాను హస్తంలో చేరనున్నట్లు చెప్పారని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే బీఆర్ఎస్ కీలక నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి