Revanth Reddy challenged KCR to touch Congress MLAs :   బీఆర్ఎస్ కారు  కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.  మహబూబ్‌నగర్‌లో ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘20 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ అంటున్నారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి. మా ఎమ్మెల్యేలను ముట్టుకో.. మాడి మసైపోతావు. పాలమూరు కోసం అనేక ప్రాజెక్టులు చేపట్టాం. పదేళ్లుగా ఈ జిల్లాను ఎడారిగా మార్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా? పార్లమెంటులో నిద్రపోవడానికా భారాసకు ఓటు వేయాలి?’’ అని రేవంత్ ప్రశ్నించారు.


 పదేళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెచ్చారా అని ప్రశ్నించారు. పార్లమెంటులో నిద్రపోవడానికి బీఆర్ఎస్ కు ఓటు వేయాలా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం మూడునెలలు మాత్రమే అయ్యిందని, పిట్టల దొరకు తాతయ్యగా కేసీఆర్ తయారయ్యారని విమర్శించారు. పాలమూరుకు కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. పనిలోపనిగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణపైనా విరుచుకుపడ్డారు. పదేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. ఢిల్లీలో మోడీ, గల్లీలో కేసీఆర్ పాలనను చూశామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయని, తమను ఓడించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. లక్ష మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.  


ఎంపీ ఎన్నికల్లో పాలమూరులో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.   గతంలో  కేసీఆర్ పాలమూరు నుంచి గెలిచి చేసిందేమి లేదని విమర్శించారు.  పాలమూరును కేసీఆర్ నిర్లక్ష్యం చేశాడని... పాలమూరు లిప్ట్ ను కూడా  పూర్తి చేయలేదన్నారు.  గతంలో పాలమూరుకు  మంత్రి పదవులు కూడా దక్కలేదని.. డీకే అరుణ కూడా ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని విమర్శించారు.  పాలమూరు అభివృద్ధి కావలంటే 2 ఎంపీ సీట్లలో కాంగ్రెస్  గెలిపించాలని కోరారు సీఎం రేవంత్.   వంశీచంద్ రెడ్డిని లక్ష  మెజార్టీతో గెలిపించాలన్నారు.  కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని..  తనకు ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి ఉందన్నారు సీఎం.                         


బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ పార్టీ నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ సీనియర్ నేత ఇరవై మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ లోకి వస్తానని చెప్పారన్నారు. ఏడాది తర్వాత ప్రభుత్వం గందరగోళంలో పడుతుందని..బీజేపీ ఈ ప్రభుత్వాన్ని నడవనివ్వదని చెప్పుకొచ్చారు. ఈ మాటలపైనే రేవంత్ ఫైరయ్యారు.